ఫోర్బ్స్ ప్రచురించిన సంపన్నుల జాబితాలో మొదటి స్దానం ఆయనదే
2010 సంవత్సరం ముగియడంతో ఆసంవత్సరంలో ఎవరెవరూ టాప్ అంటూ చాలా పత్రికలు పోల్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటిదే హాలీవుడ్ లోఒకటి జరిగింది. 2010సంవత్సరానికి గాను హాలీవుడ్ లోఎక్కవ డబ్బులు సంపాదించే వ్యక్తి ఎవరూ అంటూ సాగిన పోల్ లో చాట్ షో నిర్వాహాకులు ఓఫ్రా విన్ ఫ్రే పేరు మొదటి స్దానంలో నిలిచారు అంటూ ప్రముఖ మ్యాగజైన్ అయినటువంటి ఫోర్బ్స్ ప్రచురించింది. ఈ చాట్ షోలో భాగంగా ఓఫ్రా విన్ ఫ్రే దాదాపు 315మిలియన్ డాలర్లు సంపాదించారని సమాచారం.
ఇక2010సంవత్సరానికి గాను హాలీవుడ్ లోసూపర్ డూపర్ హిట్ అందించినటువంటి అవతార్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ 210మిలియన్ డాలర్లు సంపాదించి రెండవ స్దానంలో నిలిచారు. ఫిల్మ్ మేకర్ టేలర్ పెర్రి 125మిలియన్ డాలర్లు సంపాదించి మూడవ స్దానంతో సరిపెట్టుకున్నారు. టాప్ పది స్దానాలలో స్టీవెస్ స్పీల్ బర్గ్, జెర్రి బ్రూక్ హీమెర్, జార్జి లూకాస్, మైఖెల్ బే లాంటి మేధావులకు చోటు దక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications











