twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Oscars 2021 live: ఎక్కడ.. ఎప్పుడు చూడొచ్చంటే.. ఎవరెవరికీ అవార్డుల అంటే?

    |

    సినిమా రంగంలో నోబెల్ పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి కరోనావైరస్ అడ్డంకిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్19 వైరస్ విజృంభించడంతో ప్రతిష్టాత్మకమైన అవార్డుల కార్యక్రమానికి గతేడాది కూడా ఇలాంటి ఇబ్బంది ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ అవార్డుల కార్యక్రమం ఎప్పుడు? ఎక్కడ వీక్షించవచ్చనే విషయంలోకి వెళితే..

    ఇటీవల బాలీవుడ్ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా, ఆమె భర్త ఇంటర్నేషన్ సింగర్ నిక్ జోనస్ ఆస్కార్ అవార్డు నామినేషన్లను ప్రకటించడం తెలిసిందే. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా వారు 23 కేటగిరిలో అవార్డులను ప్రకటించారు. దీంతో 93వ ఆస్కార్ అవార్డుల వేడుకలను భారతీయులు కూడా వీక్షించడానికి అవకాశం ఏర్పడింది.

    Oscar awards 2021 live: When and Where to be streamed awards ceremony

    ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఏప్రిల్ 25వ తేదీ అర్ధరాత్రి ప్రారంభం అవుతుంది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమం స్టార్ వరల్డ్, స్టార్ మూవీస్‌లో సోమవారం ఉదయం 5.30 నుంచి భారత్‌లో ప్రసారం అవుతాయి. ఈ అవార్డుల వేడుకను ఆస్కార్.కామ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

    అయితే ఆస్కార్ అవార్డుల వేడుకకు ముందు.. భారీగా ఊహగానాలు చెలరేగుతున్నాయి. ఉత్తమ చిత్రంగా నోమ్యాడ్‌లాండ్, ఉత్తమ దర్శకుడిగా క్లో జావ్, ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా సోల్, ఉత్తమ నటుడిగా చాడ్విక్ బోస్‌మెన్, ఉత్తమ నటిగా ఫ్రాన్సెస్ మెక్‌డర్మాండ్, ఉత్తమ వీఎఫ్ఎక్స్‌ చిత్రంగా టెనెట్ చిత్రానికి అవార్డుల దక్కుతాయి సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు.

    English summary
    Oscars 2021 live:Prestigious Oscars 2021 is all set to go with good guns. 23 categories of This awards will take place on Sunday, April 25, 2021. The viewers in India will be able to watch the live stream of the Oscars at 5:30 AM on Monday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X