For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Oscar Awards 2022 స్టేజ్ పైనే బూతులతో గొడవలు. విల్ స్మిత్ అవార్డ్ వెనక్కి తీసుకునే ఆలోచన..?

  |

  ప్రపంచం హాలీవుడ్ ప్రముఖ నటుడు విల్ స్మిత్ మరోసారి కొత్త వివాదం ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అతను ఎలాంటి పని చేసినా కూడా సాధారణంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. స్వతహాగా మంచి వ్యక్తి అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని అనుకోని కారణాలతో వివాదాల్లో కేంద్రబిందువుగా మారుతూ ఉంటాడు. అయితే ఇటీవల మరొక సహనటుడు స్టేజ్ మీదనే చేయిచేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అది కూడా ప్రపంచం మొత్తం చూసే ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే విల్ స్మిత్ చేసిన పనికి అతను గెలిచిన ఆస్కార్ అవార్డు కూడా వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  వైభవంగా ఆస్కార్ వేడుకలు

  వైభవంగా ఆస్కార్ వేడుకలు

  ప్రపంచ మొత్తంలో అత్యంత ప్రాముఖ్యత గల అవార్డులలో ఆస్కార్ ఒకటి. ఈ అకాడమీ అవార్డ్స్ కోసం ప్రపంచంలోనే అన్ని రకాల సినిమాలు నటీనటులు పోటీ పడుతూ ఉంటారు. ఇక హాలీవుడ్ సినిమాలకు ఏ స్థాయిలో క్రేజ్ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక 2021 లో వచ్చిన సినిమాలకు గాను ఇటీవల అవార్డులను ప్రకటించడం జరిగింది. లాస్ ఏంజిల్స్ లోనే డాల్బీ థియేటర్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవం లో చాలా మంది అగ్ర నటీనటులు సినిమా టెక్నీషియన్స్ పాల్గొన్నారు.

  చెంపపగలగొట్టిన విల్ స్మిత్

  చెంపపగలగొట్టిన విల్ స్మిత్

  అయితే అంతా సవ్యంగా కొనసాగుతుంది అనుకుంటున్న సమయంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తోటి సహనటుడి పై చేయి చేసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతే కాకుండా అతను స్టేజిపై నుంచి కిందకు దిగిన తర్వాత కూడా ఏమాత్రం గ్యాప్ లేకుండా బూతులతో తిట్టడం తోటి వారిని షాక్ కు గురి చేసింది. అయితే లైవ్ టెలికాస్ట్ లో ఇది లేకుండానే కొనసాగినట్లు తెలుస్తోంది. కానీ ఇతర దేశాల్లో మాత్రం లైవ్ కు సంబంధించిన వీడియో ఫుటేజ్ వైరల్ అయ్యింది.

  గొడవకు కారణం..

  గొడవకు కారణం..

  ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లో విల్ స్మోత్, క్రిస్ రాక్ పై ఎందుకు చేయి చేసుకున్నాడు అనేది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. క్రిస్ రాక్, స్మిత్ భార్య పై అనవసరమైన జోకులు వేయడమే గొడవకు కారణమని తెలుస్తోంది. ఆమెకు జుట్టు లేకపోవడంతో చూడడానికి జీఐ జేన్‌ 2 లాగా ఉందంటూ కామెంట్‌ చేశాడు. నిజానికి జాడాకు అలోపెషియా అనే వ్యాధి కారణంగా.. జుట్టు రాలిపోగా.. గుండు లుక్‌తో దర్శనమిచ్చింది. ఇక భార్య మీద అలా జోక్ వేయగానే జోక్‌కు విల్‌ స్మిత్‌ గూబ పగలకొట్టి ఉంటాడని తెలుస్తోంది.

  Recommended Video

  Will Smith Conflict With Chris Rock Explained విల్ స్మిత్ భార్యకి ఉన్న వ్యాధి ఏంటి?
   అవార్డును వెనక్కి తీసుకునే అవకాశం..

  అవార్డును వెనక్కి తీసుకునే అవకాశం..

  బెస్ట్ యాక్టర్ గా విల్ స్మిత్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ గొడవ కారణంగా విల్ స్మిత్ నుంచి ఆస్కార్ ను వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆస్కార్ సంస్థ అఫీషియల్ గా వైలెన్స్ ను ఏమాత్రం సహించబోమని అందుకు తగిన చర్యలు కూడా కొనసాగుతాయని వివరణ అయితే ఇచ్చింది. దీంతో విల్ స్మిత్ నుంచి అవార్డును వెనక్కి తీసుకోవచ్చు అని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి అకాడమీ నిర్వాహకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

  English summary
  Oscar Awards 2022 another shocking story on will smith oscar
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X