For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Oscar Awards 2022: ఆస్కార్ వేడుకలో అపశృతి.. నటుడిపై విల్ స్మిత్ దాడి.. భార్యను ఆ మాట అనడం వల్లే!

  |

  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమాలకు సంబంధించిన అత్యుత్తమ పురస్కారమే 'ఆస్కార్'. దీన్నే అకాడమీ అవార్డు అని కూడా అంటారు. ఈ రంగంలోనే ఉత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, సాంకేతిక నిపుణులకు ప్రతి ఏడాది ఈ అవార్డులను ప్రదానం చేస్తుంటారు. వీటి ప్రదానోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి. అందుకు అనుగుణంగానే 94వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతోంది. అయితే, ఈ వేడుకలో తాజాగా ఓ అపశృతి చోటు చేసుకుంది. ఉత్తమ నటుడిగా ఎంపికైన విల్ స్మిత్.. ప్రముఖ నటుడు క్రిస్ రాక్‌పై స్టేజ్ మీదే దాడి చేశాడు. అసలేం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు మీ అందరి కోసం!

  Recommended Video

  Will Smith Conflict With Chris Rock Explained విల్ స్మిత్ భార్యకి ఉన్న వ్యాధి ఏంటి?
  ఎంతో గ్రాండ్‌గా అస్కార్ ఫంక్షన్

  ఎంతో గ్రాండ్‌గా అస్కార్ ఫంక్షన్

  94వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతోంది. అంగరంగ వైభవంగా జరుగుతోన్న ఈ వేడుకలో తారల తళుకుబెళుకులు కనిపిస్తున్నాయి. మొత్తం 23 విభాగాల్లో అవార్డులను ప్రకటించబోతున్నారు. దీనికోసం ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు విచ్చేశారు. కొందరు ప్రత్యేకమైన ప్రదర్శనలు కూడా ఇచ్చారు.

  ఉత్తమ నటుడిగా ఎంపికైన్ స్మిత్

  ఉత్తమ నటుడిగా ఎంపికైన్ స్మిత్

  అంగరంగ వైభవంగా జరుగుతోన్న 94వ ఆస్కార్ అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమం ఇప్పటికే దాదాపుగా పూర్తైపోయింది. ఇందులో 23 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. అందులో ఎంతో స్పెషల్‌గా భావించే ఉత్తమ నటుడు కేటగిరీలో విల్ స్మిత్‌ను ఈ అవార్డు వరించింది. 2021లో వచ్చిన ‘కింగ్ రిచర్డ్స్' అనే చిత్రానికి గానూ ఈ హాలీవుడ్ హీరో ఆస్కార్‌ను అందుకున్నాడు.

  క్రిస్ రాక్‌పై విల్ స్మిత్ పిడిగుద్దు

  క్రిస్ రాక్‌పై విల్ స్మిత్ పిడిగుద్దు


  ఎంతో వైభవంగా జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో విజేతలుగా నిలిచిన వాళ్ల గురించి ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ స్పీచ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరినీ నవ్వించాడు. ఇందులో భాగంగానే ఓ సందర్భంలో ఉత్తమ నటుడిగా ఎంపికైన విల్ స్మిత్‌‌ స్టేజ్ మీదకు దూసుకొచ్చి మరీ అతడి ముఖంపై పిడిగుద్దు గుద్దాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు.

  నా భార్యను అలా అనొద్దు అంటూ

  నా భార్యను అలా అనొద్దు అంటూ


  క్రిస్ రాక్‌ను స్టేజ్ మీదకు వెళ్లి మరీ కొట్టిన విల్ స్మిత్ ఆరంభంలోనే నవ్వుతూనే కనిపించాడు. దీంతో ఇదంతా ఫన్నీగా జరిగిందని అంతా అనుకున్నారు. కానీ, కిందకు వచ్చిన తర్వాత క్రిస్ రాక్‌ వైపు సీరియస్‌గా చూస్తూ ‘నీ ఫ** నోటి నుంచి నా భార్య పేరు రావొద్దు' అంటూ గట్టిగా అరిచాడు స్మిత్. దీంతో వీళ్లిద్దరి మధ్య జరిగింది నిజమే అని అందరూ ఓ క్లారిటీకి వచ్చేశారు.

  స్మిత్ భార్యను ఏమన్నాడంటే

  స్మిత్ భార్యను ఏమన్నాడంటే

  94వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి సమర్పకుడిగా ఉన్న క్రిస్ రాక్.. స్టేజ్‌పై విజేతలను ప్రకటించే సమయంలో విల్ స్మిత్‌ను ప్రశంసించాడు. అదే సమయంలో అతడి భార్య జడా పింకెట్ స్మిత్ గురించి జోక్ చేశాడు. ‘ఆమె చూడ్డానికి అచ్చం G.I. Jane 2లాగ ఉంది' అని కామెడీ చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన విల్ స్మిత్.. క్రిస్‌పై అందరి ముందే దాడి చేశాడు.

  దాడి తర్వాత క్రిస్ రియాక్షన్

  దాడి తర్వాత క్రిస్ రియాక్షన్

  విల్ స్మిత్ వచ్చిన తనపై దాడి చేయడంతో క్రిస్ రాక్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కాసేపు ఏం జరిగిందో అతడికి అర్థం కాలేదు. ఆ తర్వాత తన భార్య గురించి మాట్లాడొద్దు అని స్మిత్ అరిచిన తర్వాత తేరుకున్నాడు. విషయం తెలియడంతో క్రిస్ రాక్ ‘ఈ మేటర్‌ను వదిలేస్తున్నాను. ఆస్కార్ చరిత్రలోనే ఇది గొప్ప రాత్రి' అంటూ ఊహించని విధంగా రియాక్ట్ అయ్యాడు.

  English summary
  The 94th Academy Awards (Oscar) Announcing Event Placed At Dolby Theatre in Los Angeles. Will Smith Slaps Chris Rock on This Stage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X