Oscar Awards 2024 Live: 96వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవ వేడుకలు.. లైవ్ ఎక్కడ? ఎప్పుడంటే?

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినీ అవార్డ్ ఆస్కార్. ఈ పురస్కారానికి 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇన్నేళ్లలో అతి తక్కువమంది భారతీయులు ఆస్కార్‌ విజేతలుగా నిలిచారు. అయితే మరి కాసేపట్లో 96వ ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. విజేతలు ఎవరు తేలనున్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, సినీ సెలబ్రిటీలు, నామినేట్ అయిన వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది RRR బరిలో ఉండటంతో ఇండియాలో కూడా ఆస్కార్ వేడుకలకు భారీగా రీచ్ పెరిగింది. కాబట్టి మీరు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని భారతదేశంలో ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం..

లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ అవార్డులను ప్రకటిస్తారు. మార్చి 11 (సోమవారం) తెల్లవారుఝామున నుంచి ఈ కార్యక్రమం భారీ భద్రత మధ్య మొదలు కానుంది. OTT ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ హెచ్‌డీ, స్టార్ వరల్డ్‌లో కూడా ఈ ఆస్కార్ అవార్డ్ వేడుకలను ప్రత్యక్షప్రసారం చూడొచ్చు,

Oscar Awards 2024 Live Where When to know Here is Full list of winners

ఇక ఈ సారి కూడా కమెడియన్, నటుడు జిమ్మీ కిమేల్ ఆస్కార్ వేడుకను హోస్ట్ చేయనున్నారు. దాదాపు 23 కేటగిరీలలో ఆస్కార్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వంలో వచ్చిన ఓపెన్‍హైమర్ చిత్రం ఏకంగా 13 విభాగాల్లో ఆస్కార్​కు నామినేషన్ దక్కించుకుంది. దీంతో పాటే 'బార్బీ', 'పూర్‌థింగ్స్‌', 'కిల్లర్స్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌' సహా పలు చిత్రాలు ఆస్కార్​కు గట్టిగానే పోటీనిస్తున్నాయి. భారత్​ నుంచి టు కిల్ ఏ టైగర్ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో నామినేట్ అయింది.చూాడాలి మరి భారత్​కు ఏమైనా ఆస్కార్ వస్తుందో లేదో?

  • గతేడాది ఆస్కార్ అవార్డులు గెలుచుకొన్న నటులు బ్రెండన్ ఫ్రేజర్, కే హుయ్ క్వాన్, జామీ లీ కర్టీస్, మహెర్‌శాల ఆలీ, జెస్సీకా లాంజ్, మ్యాథ్యూ మెక్ కొనాగే, సామ్ రాక్ వెల్ తదితరులు ప్రజెంటర్స్‌గా వ్యవహరిస్తారు.
  • మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ విభాగంలో:
    పూర్ థింగ్స్ సినిమాకు వర్క్ చేసిన నాడియా స్టాసీ, మారే కోరియర్, జోస్ వెస్టన్ గెలుచుకొన్నారు.
  • క్యాస్టూమ్స్ విభాగంలో

బార్బీ, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, నెపోలియన్, ఓప్పెన్ హైమర్ సినిమాలు పోటీ పడ్డాయి. పూర్ థింగ్స్ చిత్రానికి పనిచేసిన హాలీ వాడింగ్టన్‌కు ఉత్తమ అవార్డు లభించింది.

  • బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు

ఈ అవార్డు విషయానికి వస్తే.. యూనైటెడ్ కింగ్ డమ్‌కు చెందిన ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సినిమాకు లభించింది.

Oscar Awards 2024 Live Where When to know Here is Full list of winners
  • Best Supporting Actor: Robert Downey Jr

స్టెర్లింగ్ కే బ్రౌన్ (Americal Fiction), రాబర్డ్ డీ నీరో (Killers of the Flower Women)
రాబర్ట్ డౌనీ జూనియర్ (OppenHeimer ), ర్యాన్ గోస్లింగ్ (Barbie), మార్క్ రఫాలో (Poor Things) నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ విభాగంలో రాబర్ట్ డౌనీ జూనియర్‌ను ఈ అవార్డు లభించింది.

  • Best Visual Effects: Godzilla Minus One

ది క్రియేటర్, గాడ్జిల్లా మైనస్ వన్, మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకానింగ్ పార్ట్ వన్, గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3, నెపోలియన్ చిత్రాలు నామినేషన్స్‌లో నిలిచాయి. అయితే గాడ్జిలా మైనస్ వన్ సినిమాకు ఉత్తమ అవార్డుల లభించింది. ఈ సినిమాకు ఈ విభాగంలో పనిచేసిన టకాషి యమాజకి, కియోకో శిబుయా, మసాకి తకాహషి, టాట్‌సుజీ నోజిమా టీమ్‌కు అవార్డు లభించింది.

  • Best Editing: Jennifer Lame (OppenHeimer)

అనాటమీ ఆఫ్ ఫాల్, ది హోడోవర్స్, కిల్లర్స్ ఆఫ్ ది మూన్, ఓప్పెన్‌మేర్, పూల్ ఆఫ్ ది థింగ్స్ సినిమాలు ఈ విభాగంలో నామినేట్ అయ్యాయి. అయితే అత్యంత పాపులారిటీ సాధించిన ఓప్పెన్ హైమర్ సినిమాకు పనిచేసిన జెన్నిఫర్ లామేకు ఉత్తమ ఎడిటర్ అవార్డు లభించింది.Best

  • Sound: Tarn Willers, Johannie Burn (Zone Of Interest)

ది క్రియేటర్, మాస్ట్రో, మిషన్ ఇంపాజిబుల్, ఓప్పెన్‌హైమర్, ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చిత్రాలు నామినేషన్ సాధించాయి. ఈ విభాగంలో జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సినిమా అవార్డును గెలుచుకొన్నది. W ఈ సినిమా కోసం పనిచేసిన టార్న్ విల్లెర్స్, జానీ బర్న్‌కు ఈ అవార్డు లభించింది.Best Original

  • Score: Ludwig Goransson (Oppenheimer)

బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అమెరికన్ ఫిక్షన్, ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ ది డెస్టినీ, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, ఓప్పెన్‌హైమర్, పూర్ థింగ్స్ చిత్రాలు బరిలో నిలిచాయి. ఈ విభాగంలో ఓప్పెన్ హైమర్ సినిమాకు పనిచేసిన లడ్‌విగ్ డోరాన్సన్‌కు అవార్డు లభించింది.Best

  • Original Song: What Was I made for (Barbie)
  • Oscar Awards 2024 Live Where When to know Here is Full list of winners

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ది ఫైర్ ఇన్‌సైడ్ (ఫ్లామిన్ హాట్), ఐయామ్ జస్ట్ కెన్ (బార్బీ), ఇట్ నెవర్ వెంట్ అవే (అమెరికన్ సింఫనీ), వాజాజే (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్), వాట్ ఐ మేడ్ ఫర్ (బార్బీ) చిత్రాలు నామినేషన్‌లో నిలిచాయి. ఈ విభాగంలో బార్బీ సినిమాలోని పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా అవార్డును సొంతం చేసుకొన్నది.

  • Best Actor: Cillian Murphy (Oppenheimer)

బ్రాడ్లీ కూపర్ (మేస్త్రో) కాల్మన్ డొమింగో (రస్టిన్) పాల్ గియమాటి (ది హోల్డర్) కలియన్ మర్ఫీ ( ఒప్పెన్‌హైమర్) జెఫ్రీ రైట్స్ (అమెరికన్ ఫిక్షన్) 2024 ఆస్కార్ అవార్డుల నామినేషన్స్‌కు ఎంపికయ్యారు. ఈ విభాగంలో ఓప్పెన్‌హైమర్ సినిమాలో నటించిన కలియన్ మర్ఫీ ఉత్తమ నటుడు అవార్డును అందుకొన్నాడు.

  • Best Director: Christopher Nolan (Oppenheimer)

క్రిస్టఫర్ నోలన్ (అప్పెన్‌హైమర్), జస్టిన్ ట్రైట్ -( అనాటమీ ఆఫ్ ఏ ఫాల్) మార్టిన్ స్కోర్సెస్ (కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్), యార్గోస్ లాంతిమోస్ (పూర్ థింగ్స్ ), జోనాథన్ గ్లేజర్ (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్) ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఓప్పెన్ హైమర్ సినిమాకు దర్శకత్వం వహించిన క్రిస్టఫర్ నోలన్‌కు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది.

  • Best Actress: Emma Stone

అన్నెట్టే బెన్నింగ్ (న్యాడ్), లిల్లీ గ్లాడ్ స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్), సండ్రా హుల్తెర్ (అనాటమీ ఆఫ్ ఏ ఫాల్), కెర్రీ మాలిగన్ (మేస్ట్రో), ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) ఉత్తమ నటి విభాగానికి నామినేట్ అయ్యారు. ఈ ఏడాది ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్ అవార్డు అందుకొన్నారు.

  • Best Picture: Oppenheimer

అమెరికన్ ఫిక్షన్, అనాటమీ ఆఫ్ ఏ ఫాల్, బార్బీ, ది హోల్డోవర్స్, ది కిల్లర్ ఆఫ్ ఫ్లవర్ మూన్, మేస్ట్రో, ఓప్పెన్‌హైమర్, పాస్ట్ లైవ్స్, పూర్ థింగ్స్, ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సినిమాలు ఉత్తమ చిత్రం అవార్డుల నామినేషన్‌లో నిలిచాయి. ఈ విభాగంలో క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఓప్పెన్‌హైమర్ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు లభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X