ఆస్కార్ చిత్రం 'ది హర్ట్ లాకర్' ఇండియాలో రిలీజ్ ఎప్పుడంటే..
ఆస్కార్ అవార్డుల్లో అవార్డు గెలుచుకొనే వరకూ ఆ సినిమాను పట్టించుకున్న నాధుడే లేడు. ఫ్లాప్ సినిమాల లిస్టులే చేరిపోయిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుల్లో, డైరెక్టర్ గిల్డ్ అవార్డుల్లో, బాఫ్తా అవార్డుల్లో సత్తా చాటుకుంది. దీంతో మరీ పెద్ద సినిమా అయితే కానీ, లేదా సూపర్ హిట్ అయితే కానీ భారత్ లో విడుదల కానీ హాలీవుడ్ సినిమాలలో ఈ ఫ్లాప్ చిత్రం ఇక్కడ విడుదలవుతోంది. క్యాథరీన్ బిగిలోవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 9న ఇక్కడ విడుదల అవుతోంది.
ఇక ఈ సినిమా ఇరాక్ యుద్ధం నేపథ్యంలో జరుగుతుంది. కదనరంగంలో పనిచేసే బాంబ్ లను నిర్వీర్యం చేసే వారి జీవితాలు ఏవిధంగా వుంటాయో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. మహిళ అయినా క్యాథరీన్ బిగిసోవ్ ఇరాక్ లో 15 రోజుల పాటు బాంబ్ స్వార్డ్ సిబ్బందితో వుంటూ వారి దినచర్యను, వారి మానసిక స్థతిని అధ్యయనం చేసి ఈ సినిమాను రూపొందించారు. అందుకే ఈమెను కూడా ఆస్కార్ వరించింది. మరీ సినిమా ఎలా వుందో అని ఆశక్తిగా వుందా అయినా 9వ తారీఖు వరకూ ఎదురుచూడాల్సిందే..


Click it and Unblock the Notifications











