80ఏళ్ల వయసులో తండ్రైన స్టార్ హీరో - ముసలోడే కానీ మహానుభావుడు!

తండ్రి అయిన హీరో, తండ్రైన ప్రముఖ నటుడు అంటూ మనం చాలా వార్తలు వింటూనే ఉంటాం. అయితే పిల్లలకు పెళ్లి చేయాల్సిన వయసులో తండ్రి అవుతూ వార్తల్లో నిలుస్తున్న వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే ఇలాంటి సంఘటనలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడలేం కానీ.. హాలీవుడ్​ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగానే వింటూ ఉంటాం. స్టార్ హీరోలు, యాక్టర్లు ఇలాంటి గుడ్ న్యూస్​లు చెబుతూ అభిమానులను షాక్ ఇస్తుంటారు. అలా తాజాగా ఓ స్టార్​ హీరో 80 ఏళ్ల వయసులో తండ్రి అయ్యారు. తాను ఈ వయసులో తండ్రి కావడంపై ఆయన మాట్లాడారు.

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హాలీవుడ్ నటుడు, రెండు సార్లు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్​ గ్రహీత రాబర్ట్ డి నీరో గత ఏడాది 80 ఏళ్ళ వయసులో తండ్రి అయ్యారు. ఈయన ఓ వైపు ప్రొఫెషనల్​ కెరీర్​ను సక్సెస్​ఫుల్​గా రన్ చేస్తూనే మరోవైపు పర్సనల్ లైఫ్​ను కూడా చక్కగా రన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు పిల్లలను కన్నా రాబర్ట్​ ఇప్పుడు ఏడో సంతానానికి జన్మనిచ్చి అభిమానులకు షాక్​ అండ్ సర్​ప్రైజ్ ఇచ్చారు. తన గర్ల్ ఫ్రెండ్ టిఫనీ చెన్​తో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ పాపకి గియా అనే పేరును నామకరణ చేశారు.

 Oscar winner Actor Robert De Niro Comments About His New Born Girl At Age News Goes Viral

అయితే ఇప్పటికే రెండు సార్లు ఆస్కార్ అవార్డును(బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా, మరోసారి బెస్ట్ యాక్టర్‌గా) అందుకున్న రాబర్ట్​.. ఈ ఏడాది కూడా ఆస్కార్​ నామినేషన్​కు ఎంపిక అయ్యారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన. తన పాప గియా గురించి మాట్లాడారు. తన కూతురుపై తనకున్న ప్రేమను తెలియజేశారు. తనను చూస్తే తనకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా వాటిని మర్చిపోతానని చెప్పుకొచ్చారు.

 Oscar winner Actor Robert De Niro Comments About His New Born Girl At Age News Goes Viral

"నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా, తనని ఒక్కసారి చూస్తే అన్ని మర్చిపోతాను. తను అంత ముద్దుగా చూస్తుంటుంది. ప్రతిదీ గమనిస్తుంటుంది. తను అలా చూస్తుంటుంటే చాలా అందంగా ఉంటుంది. నేను 80 ఏళ్ళ వయసులో తండ్రిని కావడం పెద్ద విశేషమే. నేను ఉన్నంత కాలం తనతోనే ఉండలని కోరుకుంటున్నాను" అని రాబర్ట్​ పేర్కొన్నారు. కాగా రాబర్ట్​కు కలిగిన సంతానంలో ఇప్పటికే ఇద్దరు హాలీవుడ్​లోని పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఆయనకు గతంలో ముగ్గురు భార్యలతో విడాకులు అయ్యాయి.

 Oscar winner Actor Robert De Niro Comments About His New Born Girl At Age News Goes Viral

ఇకపోతే గతేడాది ఏడాది మరో హాలీవుడ్ నటుడు 'అల్ పాసినో' కూడా 83ఏళ్ల వయసులో తండ్రి అయిన సంగతి తెలిసిందే. అల్ పాసినో నాలుగోసారి తండ్రి అయ్యారు. ఇక్కడ విశేషం ఏంటంటే అల్ పాసినో, రాబర్ట్ డి నీరో ఇద్దరు కలిసి గాడ్ ఫాదర్ సినిమాలో కలిసి నటించారు. దీంతో పలువురు నెటిజన్లు... నటనలోనే కాదు తండ్రి అవ్వడంలోను కూడా ఇద్దరు పోటీ పడుతున్నారుగా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X