twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ 2015 ‌:విజేతలు...అవార్డు అందుకున్న వేళ (ఫొటోలు)

    By Srikanya
    |

    లాస్‌ఏంజిల్స్‌: అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో 87వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉత్తమ నటుడిగా ఎడీ రెడ్‌ మెన్‌ ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు. ది గ్రాండ్‌ బుడాపెస్ట్‌ హోటల్‌, బర్డ్‌మ్యాన్‌ చిత్రాలకు నాలుగు విభాగాల్లో, విప్‌లాష్‌ చిత్రానికి 3 విభాగాల్లో ఆస్కార్‌ పురస్కారాలు దక్కాయి. ప్రపంచంలోని పలువురు ప్రముఖ నటీ, నటులు ఈ వేడుకకు హాజరయ్యారు.

    లాస్‌ఏంజిల్స్‌ నగరంలో 87వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. విప్‌లాష్‌ చిత్రంలో ఉత్తమ సహాయ నటుడిగా సిమన్స్‌కు ఆస్కార్‌ అవార్డు దక్కింది. ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఐడా(పోలాండ్‌)కు, ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో వెటరన్‌ ప్రెస్‌ 1కు ఆస్కార్‌ లభించింది. వస్త్ర, కేశ అలంకరణ, మేకప్‌ విభాగాల్లో గ్రాండ్‌ బుడాపెస్ట్‌ హోటల్‌ ఆస్కార్‌ కైవసం చేసుకుంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఉత్తమ సహాయనటుడిగా విప్‌ప్లాస్‌ చిత్రంలో నటించిన జేకే సిమిన్స్‌ ఆస్కార్‌ అందుకున్నారు. ఉత్తమ సహాయనటిగా బాయిహుడ్‌లో నటించిన పాట్రిషియా ఆర్కెట్‌ అస్కార్‌ సొంతం చేసుకుంది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఐదా(పోలండ్‌)కు ఆస్కార్‌ వరించింది.

    స్లైడ్ షోలో మిగతా ఫొటోలు

    బర్డ్ మ్యాన్

    బర్డ్ మ్యాన్

    బర్డ్ మ్యాన్ చిత్రం నాలు ఆస్కార్ లు సంపాదించింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరక్టర్, బెస్ట్ ఒరిజనల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డులు సాధించింది.

    ది గ్రాండ్‌ బుడాపెస్ట్‌ హోటల్

    ది గ్రాండ్‌ బుడాపెస్ట్‌ హోటల్

    ఈ చిత్రం తొమ్మిది నామినేషన్స్ కు నాలుగు అవార్డులు సాధించింది. బెస్ట్ ఒరిజనల్ స్కోర్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ కేశాలంకరణ, మేకప్ అప్ , బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైన్ అవార్డులు సాధించింది.

    ఉత్తమ నటుడు

    ఉత్తమ నటుడు

    ఎడ్డీ రెడ్‌ మెన్‌ ఈ సారి ఉత్తమ నటుడు అవార్డు ని ది థియరీ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌ చిత్రానికి గానూ సాదించారు.

    ఉత్తమ నటి

    ఉత్తమ నటి

    జూలియన్‌ మోరే ...ఉత్తమనటిగా... స్టిల్‌ ఎలైస్ చిత్రానికి పొందింది. ఆమె తొలిసారిగా...ఈ ఆస్కార్ అవార్డుని పొందింది. ఈ చిత్రంలో ఆమె అల్జీమర్స్ పేషెంట్ గా కనిపిస్తుంది.

    జేకే సిమన్స్‌

    జేకే సిమన్స్‌

    ఉత్తమ సహాయనటుడు విభాగంలో.. జేకే సిమన్స్‌ ఈయన విజేత గా నిలిచారు. విప్‌లాష్ చిత్రానికి కానూ ఈ అవార్డుని పొందారు. ఈ చిత్రం మొత్తం మూడు అవార్డులు పొందింది.

    ఉత్తమ సహాయనటి

    ఉత్తమ సహాయనటి

    బాయ్‌హుడ్‌ చిత్రానికి గానూ ...పెట్రిసియా ఆర్కెట్ ఉత్తమ సహాయ నటి అవార్డుని పొందారు. ఇదే ఆమె తొలి ఆస్కార్

    English summary
    The 87th Academy Awards gave big surprises this evening. A lot of movies and stars won and lost at the Oscars 2015 which was held at the Dolby Theater in Hollywood, Los Angeles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X