twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పండుగ మొదలైంది :ఆస్కార్‌ నేడే!

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్: ప్రపంచమంతా కళ్లప్పగించు కుని ఎదురుచూసే ఆస్కార్‌ అవార్డుల పండుగ రానే వచ్చింది. 87వ ఆస్కార్‌ పురస్కారాల ప్రదానోత్సవం భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 5-30 గంటలకు లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ప్రారంభమయ్యింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ప్రపంచం మొత్తం ఎదురుచూసి, మాట్లాడుకుని, చర్చించుకునే స్దాయి ప్రత్యేకతను సంతరించుకున్న ఆస్కార్‌ అవార్డును అందుకోవాలన్నది చాలామంది నటీనటులకు, సాంకేతిక నిపుణులకు జీవిత కల. అయితే దానిని సాధించడమంటే మాటలు కాదు. ప్రపంచ నలుమూలల చిత్రాలన్నీ ఈ అవార్డుల కోసం పోటీపడతాయి.

    Oscars 2015 started today morning

    అంతేకాదు ఈ అవార్డు దక్కించుకోవాలంటే దీనికి ముందు ఎంతో తతంగం ఉంటుంది. తొలుత ఆస్కార్‌కు నామినేషన్లలో స్థానం దక్కించుకోవాలి. అది అంత సులువేమీ కాదు. అందులో అవకాశం లభిస్తే ఆస్కార్‌ అవార్డుల పోటీ వరకు వెళ్లేందుకు మార్గం సుగమమం అవుతుంది. ఇక అక్కడ జరిగే ఆఖరి పోరాటంలో అసలుసిసలైన విజేతలను వేదికపై ప్రకటించడంతో ఈ ఘట్టం ముగుస్తుంది.

    ఈ సారి "బర్డ్‌మ్యాన్‌, ది గ్రాండ్‌ బుడాపెస్ట్‌ హోటల్‌' చిత్రాలు ఎక్కువ శాతం విభాగాల్లో నామినేషన్లను దక్కించుకున్నాయి. ఇంకా "బాయ్‌హుడ్‌, అమెరికన్‌ స్నైపర్‌, సెల్మా, ది ఇమిటేషన్‌ గేమ్‌, ది థియరీ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌, విష్‌లాష్‌' చిత్రాలు ఆఖరి పోరాటంలో నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. వీటిలో ఏ చిత్రాలు అవార్డులను దక్కించుకుంటాయన్న అంశం సోమవారంనాడు తేలిపోనుంది.

    ఇక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండువగా సాగుతుంది. అవార్డులతో సంబంధం లేకుండా రెడ్‌కార్పెట్‌ (ఎర్రతివాచీ)పై వయ్యారాలు ఒలకపోసేందుకు హాలీవుడ్‌ తారలే కాదు ప్రపంచ సినీరంగాలకు చెందిన హీరోయిన్లు పోటీపడతారు. గతంలో బాలీవుడ్‌ సోయగం ఐశ్వర్యారాయ్‌ నాలుగైదు సార్లు ఎర్రతివాచీపై నడిచేందు కు పోటీపడిన విషయం గుర్తుండే ఉంటుంది.

    అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించే హోస్ట్‌ కూడా ఎంతో నేర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓ ప్రత్యేక బృందం హోస్ట్‌కు తర్ఫీదు ఇస్తుంది. ఈ నేపథ్యంలో అవార్డు విజేతలు ఏం మాట్లాడుతారోనన్న ఆసక్తి ప్రతిఒక్కరిలో ఏర్పడుతుంది.

    సాధారణంగా తమకు ఆ అవార్డు రావడానికి కారకులైన దర్శక, నిర్మాతలు, తోటీ నటీనటులు, సాంకేతిక నిపుణులు వంటి అందరి పేర్లు చెప్పడంతో పాటు భార్య, పిల్లలు, పనిమనుషుల వరకు అందరికీ ధన్యవాదాలు చెబుతారట. ఎక్కడ ఎవరి పేరు మరచిపోతే ఎలాంటి వివాదం వస్తుందోనన్న ఉద్దేశం విజేతల మదిలో ఉంటుందని, అందుకే వారు అలా ప్రతిఒక్కరినీ గుర్తుచేసు కుంటారని అంటారు.

    English summary
    The 87th Academy Awards is all set to announce the winner of Best Movie, Best Actor and other categories in few hours. Oscars 2015 will take place on Sunday night (Monday morning in India) at the Dolby Theatre in Hollywood. The award ceremony will be televised live at 7 pm ET (5.30 am IST/ 12 am GMT). The Oscars will start with the red carpet arrival followed by the award show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X