twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘టైటానిక్‌’ హీరో మొత్తానికి సాధించాడు

    By Srikanya
    |

    లాస్‌ఏంజిల్స్‌: అందరూ ఊహించినట్లే...'ద రివెనంట్‌' చిత్ర హీరో లియోనార్డో డికాప్రియా ఉత్తమ హీరో గా ఆస్కార్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. డాల్బీ థియేటర్‌లో జరిగిన 88వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో డికాప్రియో ఉత్తమ హీరోగా ఆస్కార్‌ అవార్డు అందుకున్నాడు.

    వీడియో కోసం ఇమేజ్ క్లిక్ చెయ్యండి

    అలాగే...'ద రివెనంట్‌' చిత్రానికి దర్శకత్వం వహించిన అలోజాండ్రో గొంజాల్వెజ్‌ ఇనార్రిటును ఆస్కార్‌ అవార్డు వరించింది. 88వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ దర్శకుడిగా అలోజాండ్రో ఆస్కార్‌ అవార్డు అందుకున్నాడు.

    జేమ్స్‌ కెమేరూన్‌ దర్శకత్వం వహించిన 'టైటానిక్‌' సినిమా గురించి తెలియని వాళ్లు ఉండరు అనడంలో అతిశయోక్తిలేదు. ఆ సినిమాలో రోస్‌, జాక్‌లుగా నటించిన కేట్‌ విన్స్‌లెట్‌, లియోనార్డ్‌ డికాప్రియోల జంట అందరికీ ఎంతో ఇష్టం. అలాంటి జంట మరోసారి జతకట్టింది. కాకపోతే సినిమా కోసం కాదు.

    ఆస్కార్‌ అవార్డుల కోసం. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో 88వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేట్‌, లియోనార్డ్‌లు జంటగా హాజరయ్యారు. వీరిద్దరినీ జంటగా కనిపించడంతో అభిమానులు ట్విట్టర్‌ ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

    Oscars 2016: Leonardo DiCaprio wins Best Actor for The Revenan

    'బ్రిడ్జ్‌ ఆఫ్‌ స్పైస్‌' చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటుడిగా మార్క్‌ రిలేన్స్‌, ఉత్తమ సహాయనటిగా 'ద డానిష్‌ గర్ల్‌' చిత్రానికి అలీసియా వికందర్‌లకు అవార్డులు దక్కాయి. మొత్తం 10 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన 'మ్యాడ్‌ మ్యాక్స్‌ ఫ్యూరీ రోడ్‌' చిత్రం ఆరు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది.

    ఆస్కార్‌ అవార్డులు విభాగాల వారీగా
    * ఉత్తమ సహాయనటుడు: మార్క్‌ రేలేన్స్‌(బ్రిడ్జి ఆఫ్‌ స్పైస్‌)
    * ఉత్తమ సహాయనటి: అలీసియా వికందర్‌(ద డానిష్‌ గర్ల్‌)
    * ఉత్తమ ఛాయాగ్రహణం: ఎమ్మాన్యుయెల్‌ లుబెజ్కి (ద రివెనంట్‌)
    * ఉత్తమ యానిమేషన్‌ చిత్రం: ఇన్‌సైడ్‌ అవుట్‌
    * ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: స్పాట్‌లైట్‌
    * ఉత్తమ సంగీతం: ద హేట్‌ ఫుల్‌ ఎయిట్‌ (మోరిక్‌వన్‌)
    * ఉత్తమ పాట: రైటింగ్స్‌ ఆన్‌ ద వాల్‌ (స్పెక్టర్‌)
    * ఉత్తమ వస్త్రాలంకరణ: జెన్నీ బెవన్‌ (మ్యాడ్‌ మ్యాక్‌ ఫ్యూరీరోడ్‌)
    * ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కొలిన్‌ గిబ్బన్‌, లిసా థామ్సన్‌ (మ్యాడ్‌ మ్యాక్స్‌ ఫ్యూరీ రోడ్‌)
    * ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ: లేస్సీ వాండర్‌వాల్ట్‌, ఎల్కా వార్టెగా, డేమియన్‌ మార్టిన్‌ (మ్యాడ్‌ మ్యాక్స్‌ ఫ్యూరీ రోడ్‌)
    * ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌: మార్క్‌ మంగిని అండ్‌ డేవిడ్‌ వైట్‌(మ్యాడ్‌ మ్యాక్స్‌: ఫ్యూరీ రోడ్‌)
    * ఉత్తమ్‌ సౌండ్‌ మిక్సింగ్‌: క్రిస్‌ జెంకిన్స్‌, గ్రెగ్‌ రడ్లాఫ్‌, అండ్‌ బెన్‌ ఓస్మో( మ్యాడ్‌ మ్యాక్స్‌: ఫ్యూరీ రోడ్‌)
    * ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: మార్గరెడ్‌ సిజెల్‌ (మ్యాడ్‌ మ్యాక్స్‌: ఫ్యూరీ రోడ్‌)
    * ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌: ఎక్స్‌మెకినా (ఆండ్రూ వైట్‌ హస్ట్‌, పాల్‌ నోరిస్‌, మార్క్‌ అర్డింగ్టన్‌ అండ్‌ సరా బెన్నెట్‌)
    * ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌(యానిమేటెడ్‌): బేర్‌స్టోరీ (గాబ్రియల్‌ ఒసోరియో అండ్‌ పటో ఎస్కాలా
    * ఉత్తమ యానిమేషన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ఇన్‌సైడ్‌ అవుట్‌(పీట్‌ డాక్టర్‌ అండ్‌ జోనన్‌ రివెరా)
    * ఉత్తమ్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌: ఎమీ (అసిఫ్‌ కపాడియా అండ్‌ జేమ్స్‌ గేరీస్‌)
    * ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌: షట్టరర్‌ (బెంజిమన్‌ క్లియరీ అండ్‌ సెరీనా అమృతేజ్‌)
    * ఉత్తమ విదేశీ చిత్రం: ఆన్‌ ఆఫ్‌ సాల్‌(నీమ్స్‌, హంగరీ)

    English summary
    Leonardo DiCaprio has won the Academy Award for Best Actor for his work in The Revenant.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X