ఆస్కార్ 2019: భారతీయ నేపథ్య ‘పీరియడ్’కు బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్
ప్రపంచ స్థాయిలో సినీ పరిశ్రమకు సంబంధించి అత్యున్నత అవార్డులుగా గుర్తింపు పొందిన ఆస్కార్ అవార్డ్స్ వేడుక లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) వైభవంగా ప్రారంభమైంది. 91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో భారతీయ నేపథ్యం ఉన్న ఓ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌కు అవార్డు దక్కింది.
'పిరియడ్. ఎండ్ ఆఫ్ సెంటనెన్స్' పేరుతో గ్రామీణ భారతంలో రుతుస్రావం విషయంలో అనుసరిస్తున్న విధానం, సహజ సిద్ధంగా అమ్మాయిల్లో జరిగే ఈ ప్రక్రియ గురించి ఓపెన్‌గా మాట్లాడటాన్ని తప్పుగా భావించే పరిస్థితులను ఫోకస్ చేస్తూ దీన్ని రూపొందించగా... బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డు దక్కింది.

పిరియడ్. ఎండ్ ఆఫ్ సెంటనెన్స్
25 ఏళ్ల రేకా జెహ్తాబి అనే అమెరికన్ దర్శకురాలు దీనికి దర్శకత్వం వహించగా.. గునీత్ మోంగా అనే భారత్‌కు చెందిన మహిళా నిర్మాత దీన్ని నిర్మించారు. రుతుస్రావం విషయంలో ఇండియాలో నెలకొన్న సామాజిక పరిస్థితులను ఫోకస్ చేసే విధంగా దీన్ని రూపొందించారు.
ప్రతి అమ్మాయి ఒక దేవత
"మేము గెలిచాం.. ఈ భూమ్మీద ఉన్న ప్రతి అమ్మాయి ఒక దేవత" అంటూ గునీత్ మోంగా భావోద్వేగానికి గురయ్యారు. రుతుస్రావం అంశంపై తీసిన డాక్యుమెంటరీకి అవార్డ్ వచ్చిందంటే నమ్మలేక పోతున్నట్లు దర్శకురాలు రేకా జెహ్తాబి వ్యాఖ్యానించారు.

ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం
ఉత్తమ సహాయనటి: రెజినా కింగ్(ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)
ఉత్తమ సినీమాటోగఫ్రీ అల్ఫాన్సోరోన్ (రోమ)
ఉత్తమ క్యాస్టూమ్ డిజైనర్: రూత్‌కార్టర్(బ్లాక్ పాంథర్)

ఆస్కార్ అవార్డ్స్
ఉత్తమ విదేశీ చిత్రం ‘రోమా'
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: ‘ఫ్రీ సోలో'
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ‘బ్లాక్ పాంథర్‘
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ‘స్పైడర్ మ్యాన్:ఇన్‌టూ ది స్పైడర్ వెర్స్


Click it and Unblock the Notifications











