Oscars 2020 Live: షాకిచ్చిన ప్రియాంక చోప్రా.. బెస్ట్ అవార్డు గెలుచుకొన్న బ్రాడ్ పిట్
Recommended Video
ఆస్కార్ అవార్డుల సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. 92వ అకాడమీ అవార్డల కార్యక్రమం లాస్ ఎంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా మొదలైంది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడుతున్నాయి. జోకర్ చిత్రం 11 నామినేషన్లు, 1917 చిత్రం 10 నామినేషన్లతో ఎక్కువ అవార్డులను సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ అవార్డుల కార్యక్రమంలో హైలెట్స్ మీ కోసం..

ప్రియాంక చోప్రా దూరం
ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌లో ప్రియాంక చోప్రా పాల్గొంటుందని అందరూ ఊహించారు. కానీ ఆమె ప్రతిష్టాత్మక అవార్డులకు గైర్హాజరు అయ్యారు. ఆమె నేను ఇంటి నుంచి ఈ అవార్డుల ఫంక్షన్‌ను తిలకిస్తారు. ఇక జానెల్లె మోనే అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో అవార్డుల కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో ఇదినా మెంజెల్ ఫ్రోజెన్ 2 అనే చిత్రంలోని ది అనోన్ అనే పాటకు ఫెర్ఫార్మ్ చేసింది.

బ్రాడ్ పిట్‌కు అవార్డు
హాలీవుడ్‌లో ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్ ఉత్తమ సహాయ నటుడు అవార్డును గెలుచుకొన్నారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ అనే చిత్రంలో అాద్భుతమైన నటనకు ఈ అవార్డు ఆయనను వరించింది. గతంలో అంటే 2014లో ఆయన నిర్మాతగా తీసిన 12 ఇయర్స్ ఏ స్లేవ్ అనే సినిమాకు ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డును అందుకొన్నారు.

బెస్ట్ యానిమేషన్ అవార్డులు
ఆస్కార్ అవార్డుల 2020 వేడుకలలో టాయ్ స్టోరి 4 అనే చిత్రం బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకొన్నది. అలాగే హెయిర్ లవ్ అనే చిత్రం ఉత్తమ యానిమేటేడ్ షార్ట్ ఫిలిం అవార్డును సొంతం చేసుకొన్నది. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డు జోజో రాబిట్ అనే చిత్రానికి టైకా వెయిటీటికి దక్కింది.

వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ హవా
ఇక వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ అనే చిత్రానికి అవార్డుల పంట పండే అవకాశం కనిపిస్తున్నది. ఆదిలోనే రెండు అవార్డులను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా హవా కొనసాగే అవకాశాలున్నాయి. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రం బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డను సొంతం చేసుకొన్నది.

అమెరికన్ ఫ్యాక్టరీకి ఒబామా ప్రశంసలు
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ అవార్డును అమెరికన్ ఫ్యాక్టరీ సొంతం చేసుకొన్నది. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికన్ ఫ్యాక్టరీ నిర్వాహకులను అభినందించారు.
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ
బెస్ట్ సినిమాటోగ్రఫి: రోజర్ డికిన్స్ [1917]
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ
బెస్ట్ సాంగ్ మిక్సింగ్: మార్క్ టేలర్, స్టువార్ట్ విల్సన్


Click it and Unblock the Notifications











