twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Oscars 2022 Nominations: ఈ రోజే భారీ స్థాయిలో ప్రకటన.. ఎలా చూడాలంటే?

    |

    ప్రపంచంలో అత్యధిక ప్రాముఖ్యత కలిగిన ఆస్కార్ అవార్డుల గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలో చాలామంది నటీనటులు టెక్నీషియన్స్ కూడా ఒక్కసారైనా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవాలని అనుకుంటారు. అయితే కరోనా కారణంగా గత కొంతకాలంగా అన్ని రకాల అవార్డుల వేడుకలకు కాస్త అంతరాయం కలిగింది. ఇక చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆస్కార్ నామినేషన్లు ఎట్టకేలకు ఈరోజు విడుదల కానున్నాయి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మంగళవారం రోజు 94వ అకాడమీ అవార్డులకు నామినీలను ప్రకటించబోతుంది.

    ఇక ఈ బిగ్గెస్ట్ అవర్ఫ్స్ షో ఎప్పుడు ఎలా ప్రసారం కానుంది అనే వివరాల్లోకి వెళితే.. ఈ ప్రకటన భారతదేశం కాలమానం ప్రకారం 6:48 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇక ఈ అవార్డుల వేడుకలో హోస్ట్ లుగా బ్లాక్-ఇష్ స్టార్ ట్రేసీ, ఎల్లిస్ రాస్ వ్యవహరించనున్నరు. ఇక మరొక హాస్యనటుడు లెస్లీ జోర్డాన్ ప్రెజెంటేషన్‌ను సహ-హోస్ట్ గా ఆకట్టుకోబోతున్నాడు. మొత్తంగా 23 అకాడమీ అవార్డు విభాగాలలో 2022 నామినీలను ప్రకటించారు. ఈసారి అత్యధిక స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా చాలా సినిమాలు ఆస్కార్ భరిలో పోటీకి సిద్ధమయ్యాయి.

    Oscars 2022 Nominations live streaming details

    2022 అకాడమీ అవార్డ్స్‌ లలో అంతర్జాతీయ చలనచిత్ర విభాగంలో ఇండియాకు చెందిన తమిళ్ మూవీ కూజాంగల్, ఇప్పటికే ఆస్కార్ రేసు నుండి నిష్క్రమించిన విషయం తెలిసిందే. తప్పకుండా షార్ట్ లిస్ట్ లో ఉంటుందని అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. ఇక బెస్ట్ ఇండియా డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో రైటింగ్ విత్ ఫైర్ షార్ట్‌లిస్ట్‌లో చేరింది.

    ఇక ఈ బిగ్గెస్ట్ అవార్డ్ ప్రజెంటేషన్ ఫిల్మ్ అకాడమీకి సంబంధించిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం కానున్నాయి. Oscar.com, Oscars.org ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్‌ బుక్ లలో కూడా చూడవచ్చు. ఇక
    ABC 'గుడ్ మార్నింగ్ అమెరికా' అలాగే ABC న్యూస్ లైవ్‌ లో ఈ ఆ అవార్డ్స్ ను లైవ్ గా చూడవచ్చు. ఇక అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆస్కార్ అకాడమీ అవార్డులను ఎవరెవరు గెలుస్తారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఉత్తమ చిత్రాల్లో
    ది పవర్ ఆఫ్ ది డాగ్, కెన్నెత్ బ్రనాగ్ నటించిన బెల్ఫాస్ట్, అలాగే రీనాల్డో మార్కస్ గ్రీన్ టెన్నిస్ బయోపిక్ కింగ్ రిచర్డ్ నామినేషన్ లో పోటీ పడవచ్చని తెలుస్తోంది.

    ఇక వరల్డ్ గ్రేట్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ డైరెక్ట్ చేసిన వెస్ట్ సైడ్ స్టోరీ రీమేక్ అలాగే పాల్ థామస్ ఆండర్సన్ లైకోరైస్ పిజ్జా కూడా పోటీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ స్పెక్టాకిల్ డూన్ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మార్వెల్ ఫ్లిక్ స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ భారీ స్థాయిలో విజయాన్ని అందుకోగా ఈసారి పోటీలో ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ పోటీలలో ఎవరు ఎన్ని అవార్డులను సొంతం చేసుకుంటారో చూడాలి. అవార్డుల ప్రదానోత్సవం కోసం నిర్వాహకులు గతంలో కంటే భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

    English summary
    Oscars 2022 Nominations live streaming details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X