Oscar Awards 2022: హవా మొత్తం ఆ సినిమాదే.. 23 విభాగాల్లో విజేతల పూర్తి వివరాలు ఇవే

ప్రతి రంగంలో ఉత్తమంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందులో సినీ రంగంలో ఇంకా ఎక్కువగా అలాంటి ఆశయంతో పని చేస్తుంటారు. నటులతో పాటు టెక్నీషియన్లు తమ వంతు కృషి చేసి సక్సెస్‌లను అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఇలా ప్రతి ఏడాది ఉత్తమ పనితీరును కనబరిచిన వాళ్లకు లభించే ప్రతిష్టాత్మక అవార్డే 'ఆస్కార్'. అకాడమీ అవార్డు అని కూడా పిలిచే దీనికోసం సినీ పరిశ్రమల్లో అందరూ తపన పడుతుంటారు. మరి 2021వ సంవత్సరానికి గానూ తాజాగా ప్రకటించిన ఆస్కార్ అవార్డులు ఎవరిని వరించాయి? ఏ విభాగంలో ఎవరు విజేతలుగా నిలిచారు? అనే వివరాలతో కూడిన పూర్తి సమాచారం మీ అందరి కోసం!

ఎంతో గ్రాండ్‌గా ఆస్కార్ ఈవెంట్

ఎంతో గ్రాండ్‌గా ఆస్కార్ ఈవెంట్

2021వ సంవత్సరానికి సంబంధించిన అందించే 94వ ఆస్కార్ అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమం లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. అంగరంగ వైభవంగా మొదలైన ఈ వేడుకలో తారల సందడి చేశారు. మొత్తం 23 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. దీనికోసం ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు విచ్చేశారు. దీంతో ఈ వేడుక మొత్తం మజాను పంచింది.

4 చిత్రాలకే ఎక్కువ నామినేషన్స్

4 చిత్రాలకే ఎక్కువ నామినేషన్స్

94వ ఆస్కార్ అవార్డులకు సంబంధించి మొత్తం 276 చిత్రాల పేరు జత చేయగా.. అందులో చాలా వాటిని తీసేసి షార్ట్ లిస్ట్ చేశారు. ఇక, ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించిన నామినేషన్స్‌లో ‘ద పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌' చిత్రం ఏకంగా 12 విభాగాల్లో నామినేట్ అయింది. అలాగే, ‘డ్యూన్‌' చిత్రం పది విభాగాల్లో, ‘వెస్ట్‌ సైడ్‌ స్టోరీ', ‘బెల్‌ఫాస్ట్‌' చిత్రాలకు ఏడేసి విభాగాల్లో చేరిపోయాయి.

ఆ సినిమాకు ఆరు.. దీనికి మూడు

డెన్నిస్ విల్లెనియువ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘డ్యూన్'. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా పది విభాగాల్లో నామినేట్ అయింది. ఇప్పటికే ప్రకటించిన విభాగాల్లో దీనికి సినిమాటోగ్రఫీ, బెస్ట్ సౌండ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్‌లో అవార్డులను అందుకుంది. అలాగే, ‘కోడా' మూవీ మూడు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది.

నటీనటుల పరంగా అవార్డులిలా

నటీనటుల పరంగా అవార్డులిలా

94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అద్యంతం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో ఉత్తమ నటుడిగా విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్స్), ఉత్తమ నటిగా జెస్సికా చస్టేన్‌ (ద ఐస్‌ ఆఫ్‌ టామీ ఫే), ఉత్తమ సహాయ నటిగా అరియానా దిబోస్‌ (వెస్ట్‌ సైడ్‌ స్టోరీ), ఉత్తమ సహాయ నటుడిగా ట్రాయ్‌ కోట్సర్‌ (CODA), ఉత్తమ చిత్రంగా చైల్డ్‌ ఆఫ్‌ డెఫ్‌ అడల్ట్స్‌(CODA) నిలిచాయి.

టెక్నికల్ విభాగం.. ఎవరెవరంటే

టెక్నికల్ విభాగం.. ఎవరెవరంటే

టెక్నికల్ విభాగంలో చూసుకుంటే.. ఉత్తమ డైరెక్టర్‌గా జేన్‌ కాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ద డాగ్‌) నిలిచారు. అలాగే, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా గ్రెగ్‌ ఫ్రెజర్‌ (డ్యూన్‌), బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌‌గా నో టైమ్‌ టు డై, బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫియేచర్‌‌గా సమ్మర్‌ ఆఫ్‌ సోల్‌, బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే CODA (షాన్‌ హెడర్‌)కు, బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో బెల్‌ఫాస్ట్‌ (కెన్నత్‌ బ్రానా)కు అవార్డు దక్కింది.

Recommended Video

Will Smith Conflict With Chris Rock Explained విల్ స్మిత్ భార్యకి ఉన్న వ్యాధి ఏంటి?
ఇంకా ఎవరికి ఏ అవార్డు వచ్చిందంటే

ఇంకా ఎవరికి ఏ అవార్డు వచ్చిందంటే

బెస్ట్‌ సౌండ్‌ - డ్యూన్‌ (మాక్‌ రుత్‌, మార్క్‌ మాంగిని, థియో గ్రీన్‌, డగ్‌ హెంఫిల్‌, రాన్‌ బార్ట్‌లెట్‌)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ - డ్యూన్‌ (ప్రొడక్షన్‌ డిజైన్‌- పాట్రైస్‌ వెర్మట్‌, సెట్‌ డెకరేషన్‌- జుజానా సిపోస్‌)
బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌స్టైలింగ్‌ - ద ఐస్‌ ఆఫ్‌ ది టామీ ఫే (లిండా డౌడ్స్‌, స్టెఫనీ ఇన్‌గ్రామ్‌, జస్టిన్‌ రాలే)
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం: ది లాంగ్‌ గుడ్‌బై
బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం: ది విండ్‌షీల్డ్‌ పైపర్‌
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం: ద క్వీన్‌ ఆఫ్‌ బాస్కెట్‌బాల్‌
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ - జెన్నీ బీవన్‌ (క్రూయెల్లా)
బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫియేచర్‌ - డ్రైవ్‌ మై కార్‌ (జపాన్‌)
బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫియేచర్‌ - ఎన్‌కాంటో
బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ - హన్స్‌ జిమ్మర్‌ (డ్యూన్‌)
బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ - డ్యూన్‌ (పాల్‌ లాంబర్ట్‌, ట్రిస్టన్‌ మైల్స్‌, బ్రియన్‌ కానర్‌, గెర్డ్‌ నెఫ్‌జర్‌)
బెస్ట్‌ ఫిలిం ఎడిటింగ్‌ - జో వాకర్‌ (డ్యూన్‌)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X