Oscars Awards 2023 ఏడు అవార్డులు అందుకొన్న సినిమా ఏంటో తెలుసా? ఆస్కార్ అవార్డుల ఫుల్ లిస్ట్..
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగవైభవంగా ముగిసింది. 95వ ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్, సైన్సెస్ అవార్డుల వేడుక లాస్ ఎంజెలెస్‌లోని డౌల్బీ థియేటర్‌లో కన్నుల పండువగా ముగిసింది. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ వేడుకలో పలువురు చిరకాల స్వప్నంగా మారిన ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకొన్నారు. ఈ ఏడాది ఆస్కార్ గెలుచుకొన్న ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఇతర కేటగిరి వివరాల్లోకి వెళితే..

ఆస్కార్ 2023 ఉత్తమ చిత్రంగా
2023 సంవత్సరం ఆస్కార్స్ అవార్డుల వేడుకలో ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రాన్ని ఆంథోని రుసో, జో రూసో నిర్మించగా, డేనియల్ క్వాన్, డేనియల్ షీనెర్ట్ దర్శకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే.. చైనాకు చెందిన దంపతులు అమెరికాలో స్థిరపడి.. డ్రైక్లీనింగ్ బిజినెస్‌లో ఉంటారు.
వారి మధ్య చోటు చేసుకొన్న కుటుంబ కలహాలు, ప్రవాస జీవితం, లెస్పీయన్ రిలేషన్ షిప్ లాంటి అంశాలు సినిమాను భావోద్వేగంగా మార్చాయని సినీ పండితులు విశ్లేషించారు. మధ్య తరగతి జీవితాన్ని ప్రతిబించే చిత్రానికి ఉత్తమ కథా చిత్రంగా ఆస్కార్ పట్టం కట్టింది.

ఉత్తమ నటిగా ఎవరంటే?
ఆస్కార్ 2023 వేడుకల్లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకొన్న మిచెల్లీ యో విషయానికి వస్తే.. హాంకాంగ్‌కు చెందిన నటి. గతంలో మిచెల్లి ఖాన్‌గా సుపరిచితులు. గతంలో జాకీ చాన్‌తో పోలీస్ స్టోరి 2, పోలీస్ స్టోరి 3 చిత్రాల్లో నటించింది. కొద్ది సంవత్సరాల క్రితం తన మకాంను అమెరికాకు మార్చింది.
జేమ్స్ బాండ్ చిత్రం టుమార్ నెవర్ డైస్ అనే సినిమాలో నటించింది. 2023లో గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డులను గెలుచుకొన్నది. ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రంలో ఎవ్లీన్ క్వాన్ వాంగ్ పాత్రలో ప్రదర్శించిన అద్బుతమైన నటనకు గాను ఆస్కార్‌ను సొంతం చేసుకొన్నది.

ఉత్తమ నటుడిగా బ్రెండన్ ఫ్రేజర్
ఆస్కార్ 2023 వేడుకల్లో బ్రెండన్ ఫ్రేజర్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకొన్నారు. కెనడా అమెరికన్‌కు చెందిన ఈ నటుడు ది వేల్ అనే సినిమాలో పెర్ఫార్మెన్స్‌కు మెచ్చిన క్రిటిక్స్.. ఈయనకే ఓటు వేశారు. దాంతో ఆస్కార్ అవార్డు బ్రెండన్ ఫ్రేజర్ సొంతమైంది. గతంలో మమ్మీ ట్రాయాలజీ, గాడ్స్ అండ్ మాన్స్ టర్, క్రాష్ సినిమాల్లో నటించారు. ది వేల్ సినిమాలో స్థూలకాయుడైన ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా అద్బుతంగా నటించారు.

ఉత్తమ దర్శకులుగా ఎవరంటే?
ఆస్కార్ అవార్డులు 2023లో ఉత్తమ దర్శకులుగా డేనియల్ క్వాన్, డేనియల్ షీనెర్ట్ ఎంపికయ్యారు. ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి దర్శకులుగా వీరిద్దరు వ్యవహరించారు. హాలీవుడ్‌లో వీరిని డేనియల్స్‌గా వ్యవహరిస్తారు. ఇంతకు ముందు స్విస్ ఆర్మీ మ్యాన్ సినిమాను తెరకెక్కించారు. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు, క్రిటిక్ ఛాయిస్ అవార్డు, అలాగే ఆస్కార్ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకులు, ఉత్తమ నటి అవార్డులు రావడానికి వీరి ప్రతిభ దోహదపడింది.

ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ 7 అవార్డులు
ఆస్కార్ 2023 అవార్డుల్లో Everything Everywhere All At Once చిత్రం హవాను కొనసాగించింది. దాదాపు 7 అవార్డులను ప్రధాన క్యాటగిరిలో గెలుచుకొన్నది. తాజా ఆస్కార్ అవార్డుల్లో పురస్కారాలు అందుకొన్న సినిమాలు, సినీ నిపుణులు వివరాలు ఇవే..
Best Picture: Everything Everywhere All At Once
Best Actress: Michelle Yeoh (Everything Everywhere All At Once)
Best Actor: Brendan Frazer (The Whale)
Best Director: Daniel Kwan and Daniel Scheinert (Everything Everywhere All At Once)
Best Original Song: Naatu Naatu from RRR
Best Sound: Top Gun Maverick
Best Editing: Everything Everywhere All At Once
Best Visual Effects: Avatar: The Way of Water
Best Original Score: Volker Bertelmann (All Quiet on the Western Front)
Best Production Design: All Quiet on the Western Front
Best Short Film: The Elephant Whisperers (Kartiki Gonsalves, Producer Guneet Monga)
Best Costume Design: Black Panther: Wakanda forever (Ruth E. Carter)
Best Hair & Makeup: The Whale
Best Documentary Feature Film: Navalny
Best Actress In A Supporting Role: Jamie Lee Curtis ( Everything Everywhere All At Once)
Best Actor In A Supporting Role: Ke Huy Quan (Everything Everywhere All At Once)
Best Cinematography: James Friend (All Quiet On The Western Front


Click it and Unblock the Notifications











