Oscars 2024: 96th Academy Awards Date ఆస్కార్ అవార్డుల ప్రకటన ఎప్పుడు? ఎక్కడంటే?
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్స్ అవార్డుల వేడుకకు రంగం సిద్దమైంది. సినీ రంగంలో నోబెల్‌గా భావించే ఈ అవార్డుల కోసం జనవరి 23వ తేదీన నామినేషన్లను ప్రకటించారు. ఈ ఏడాది పోటీలో అగ్ర హీరోలు, టాప్ యాక్టర్లు, పాపులర్ చిత్రాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించిన సినిమాలు, అలాగే సినీ విమర్శకులను ఆకట్టుకొన్న ఉత్తమ చిత్రాలను నామినేట్ చేశారు. అయితే ఏడాది ఆస్కార్ అవార్డులను ప్రకటించే కార్యక్రమం ఏ రోజున అంటే..
2024 సంవత్సరంలో బార్బీ, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, నెపోలియన్, అప్పెన్‌హైమర్ చిత్రాలు బరిలో నిలిచాయి. ఉత్తమ దర్శకులుగా క్రిస్టఫర్ నోలన్ (అప్పెన్‌హైమర్), జస్టిన్ ట్రైట్ -( అనాటమీ ఆఫ్ ఏ ఫాల్), మార్టిన్ స్కోర్సెస్ (కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్), యార్గోస్ లాంతిమోస్ (పూర్ థింగ్స్)
జోనాథన్ గ్లేజర్ (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్) చిత్రాలు నిలిచాయి.

ఆస్కార్స్ 2024 నామినేషన్‌లో నిలిచిన వారిలో బ్రాడ్లీ కూపర్ (మేస్త్రో), కాల్మన్ డొమింగో (రస్టిన్), పాల్ గియమాటి (ది హోల్డర్), కలియన్ మర్ఫీ ( ఒప్పెన్‌హైమర్), జెఫ్రీ రైట్స్ (అమెరికన్ ఫిక్షన్) ఉన్నారు.
ఆస్కార్స్ ఉత్తమ నటీనటులు పోటీలో అన్నెట్టే బెన్నింగ్ (న్యాడ్), లిల్లీ గ్లాడ్ స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్), మూన్, సండ్రా హుల్తెర్ (అనాటమీ ఆఫ్ ఏ ఫాల్), కెర్రీ మాలిగన్ (మేస్ట్రో), ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) నిలిచారు.
ఇదిలా ఉండగా, ఆస్కార్ అవార్డుల ప్రధానం 2024 సంవత్సరం మార్చి 10వ తేదీన ప్రకటించనున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ అవార్డుల వేడుక జరుగనున్నది. ఇప్పటి వరకు ఈ అవార్డుల నామినేషన్స్‌లో ఒక్క భారతీయ చిత్రం కూడా లేకపోవడం ఇండియన్స్‌ను నిరాశపరిచింది. హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.


Click it and Unblock the Notifications











