Oscars 2025 Live: సినీ ప్రముఖుడికి రెండు ఆస్కార్ అవార్డులు.. ఏ చిత్రానికి ఎన్ని అవార్డులంటే?

సినిమా రంగంలో నోబెల్ బహుమతిగా భావించే 2025 సంవత్సరపు ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇప్పటికే రిహార్సల్ కార్యక్రమాలు, బ్యాక్ స్టేజ్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. మార్చి 3వ తేదీ తెల్లవారు జామున ప్రారంభమయ్యే 97వ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమానికి డాల్బీ థియేటర్ ముస్తాబైంది. అయితే ఈ అవార్డు కార్యక్రమంలో ఎవరు పాల్గొంటున్నారు? ప్రతిష్టాత్మక పురస్కారాల లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి? అనే వివరాల్లోకి వెళితే..

ఆస్కార్ అవార్డు కార్యక్రమం సోమవారం (మార్చి 3వ తేదీ) తెల్లవారు జామున 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా ప్రముఖ అమెరికన్ టెలివిజన్ హోస్ట్, యాక్టర్, కమెడియన్, రైటర్, నిర్మాత కానన్ ఓ బ్రియాన్ హోస్టింగ్ చేయనున్నారు.

Oscars 2025 Live How to Watch 97th Academy Awards in India Where When How Date and Time Details

LIVE Feed
  • Mar 3, 2025 9:21 AM

    Best Actor (బెస్ట్ యాక్టర్) కేటగిరిలో

    Best Actor (బెస్ట్ యాక్టర్) కేటగిరిలో అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్), టిమోతీ చలమెట్ (ఎ కంప్లీట్ అన్‌నోన్), కోల్మన్ డొమింగో (సింగ్ సింగ్), రాల్ఫ్ ఫియన్నెస్ (కాన్క్లేవ్), సెబాస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్) పోటీ పడ్డారు. ఈ విభాగంలో ది బ్రూటలిస్ట్ సినిమాలో బెస్ట్ యాక్టింగ్ చేసిన ఆడ్రియన్ బ్రాడీకి ఆస్కార్ పురస్కారం దక్కింది.

  • Mar 3, 2025 9:19 AM

    Best Picture (బెస్ట్ పిక్చర్) విభాగంలో

    Best Picture (బెస్ట్ పిక్చర్) విభాగంలో అనోరా (Anora) చిత్రానికి ఆస్కార్ పురస్కారం లభించింది. ఈ సినిమాకు సీన్ బేకర్ దర్శకత్వం వహించారు.

  • Mar 3, 2025 9:11 AM

    Best Actress (బెస్ట్ యాక్ట్రెస్) కేటగిరిలో

    Best Actress (బెస్ట్ యాక్ట్రెస్) కేటగిరిలో సింథియా ఎరివో (వికెడ్), కార్లా సోఫియా గాస్కాన్ (ఎమిలియా పెరెజ్), మైకీ మాడిసన్ (అనోరా), డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్), ఫెర్నాండా టోర్రెస్ (ఐ యామ్ స్టిల్ హియర్) పోటీ పడ్డారు. ఈ పురస్కారాన్ని అనోరా చిత్రంలో అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్ ప్రదర్శించిన మైకీ మాడిసన్‌కు లభించింది.

  • Mar 3, 2025 8:10 AM

    Best Live Action Short Film: (బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం)

    Best Live Action Short Film: (బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం) విభాగంలో ఐయామ్ నాట్ ఏ రోబోటో చిత్రానికి విక్టోరియా వార్మర్ డామ్, ట్రెంట్ ఆస్కార్ పురస్కారాన్ని అందుకొన్నారు.

  • Mar 3, 2025 8:01 AM

    Best Visual Effect (బెస్ట్ విజువల్ ఎఫెక్ట్) Oscar Goes To

    Best Visual Effect (బెస్ట్ విజువల్ ఎఫెక్ట్): బెటర్ మ్యాన్, డ్యూన్ పార్ట్ 2, కింగ్ డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ఏప్స్, వికెడ్ చ చిత్రాలు పోటీపడ్డాయి. ఈ విభాగంలో డ్యూన్ పార్ట్ 2 చిత్రానికి అవార్డు దక్కింది.

  • Mar 3, 2025 7:58 AM

    Best Sound (బెస్ట్ సౌండ్) కేటగిరీలో

    Best Sound (బెస్ట్ సౌండ్) కేటగిరీలో పోటీ పడ్డ డ్యూన్ పార్ట్ 2 చిత్రానికి అవార్డు దక్కింది. గెరెత్ జాన్, రిచర్డ్ కింగ్, రాన్ బార్ట్‌లెట్, డౌగ్ హెంఫిల్‌ ఈ అవార్డును అందుకొన్నారు.

  • Mar 3, 2025 7:45 AM

    Best Documentary Feature Film (బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్):

    Best Documentary Feature Film (బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్): విభాగంలో నో అదర్ ల్యాండ్ (No Other Land) చిత్రానికి అవార్డు లభించింది. ఈ చిత్రాన్ని రూపొందించిన బెసెల్ ఆడ్రా, రాచెల్ జార్, హమ్ దాన్ బల్లాల్, యువల్ అబ్రహం అందుకొన్నారు.

  • Mar 3, 2025 7:43 AM

    Best Documentary Short Film (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్)

    Best Documentary Short Film (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్) కేటగిరీలో ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా చిత్రానికి మోలీ ఓబ్రియాన్, లీసా రెమింగ్టన్ అవార్డు అందుకొన్నారు.

  • Mar 3, 2025 7:37 AM

    Best Original Sound (బెస్ట్ ఒరిజినల్ సౌండ్)

    Best Original Sound (బెస్ట్ ఒరిజినల్ సౌండ్) కేటగిరీలో ది బ్రూటలిస్ట్ (డేనియల్ బ్లంబర్గ్), కాన్క్లేవ్ (వోల్కర్ బెర్టెల్మాన్), ఎమిలియా పెరెజ్ (క్లెమెంట్ డుకోల్ అండ్ కామిల్లె), వికెడ్ (జాన్ పావెల్ అండ్ స్టీఫెన్ స్క్వార్ట్జ్), ది వైల్డ్ రోబోట్ (క్రిస్ బోవర్స్) చిత్రాలు పోటీ పడ్డాయి. ఎమిలియా పెరెజ్ (Emilia Perez) చిత్రానికి ఎల్ మాల్ (EL Mal) ఈ అవార్డును అందుకొన్నారు.

  • Mar 3, 2025 7:26 AM

    Best Production Design (బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్): Oscar Goes To

    Best Production Design (బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్) కేటగిరీలో కాన్‌క్లేవ్, డ్యూన్ పార్ట్ 2, నోస్‌పెరాటు, వికెడ్ చిత్రాలు పోటీపడ్డాయి. చివరకు ఈ అవార్డును వికెడ్ చిత్రం గెలుచుకొన్నది.

  • Mar 3, 2025 7:17 AM

    Best Supporting Actress (బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్) Oscar Goes to

    Best Supporting Actress (బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్) విభాగంలో మోనికా బార్బారో (ఎ కంప్లీట్ అన్‌నోన్), అరియానా గ్రాండే (వికెడ్), ఫెలిసిటీ జోన్స్ (ది బ్రూటలిస్ట్), ఇసాబెల్లా రోసెల్లిని (కాన్‌క్లేవ్), జో సాల్డానా (ఎమిలియా పెరెజ్) పోటీ పడ్డారు. ఈ కేటగిరీలో జో సల్దానా (Zeo Saldana) ఈ అవార్డును సొంతం చేసుకొన్నారు.

  • Mar 3, 2025 7:12 AM

    Best Editing (బెస్ట్ ఎడిటింగ్) Oscar goes to..

    Best Editing (బెస్ట్ ఎడిటింగ్) విభాగంలో అనోరా, ది బ్రూటలిస్ట్, కాన్క్లేవ్, ఎమిలియా పెరెజ్, వికెడ్ చిత్రాలు పోటీ పడ్డాయి. ఈ విభాగంలో అనోరా చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించిన సీన్ బేకర్‌కు అవార్డు లభించింది. ఈ అవార్డుల్లో ఆయన రెండు అవార్డులను అందుకొన్నారు.

  • Mar 3, 2025 6:54 AM

    Best Makeup and Hair Styling (బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్)

    Best Makeup and Hair Styling (బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్) కేటగిరీలో ఏ డిఫరెంట్ మ్యాన్, ఎమిలియా పెరెజ్, నోస్ఫెరాటు, ది సబ్‌స్టెన్స్, వికెడ్ చిత్రాలు పోటీపడ్డాయి. అయితే చివరకు ది సబ్‌స్టెన్స్ చిత్రానికి పియరీ ఒలివర్ పెర్సిన్, స్టెఫానీ గులాన్, మెరిలైన్ స్కార్లెట్ ఈ అవార్డును అందుకొన్నారు.

  • Mar 3, 2025 6:43 AM

    Best Adopted Screenplay (బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే):

    Best Adopted Screenplay (బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే) విభాగంలో ఎ కంప్లీట్ అన్‌నోన్ (జేమ్స్ మాంగోల్డ్ అండ్ జే కాక్స్), కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాఘన్), ఎమిలియా పెరెజ్ (జాక్వెస్ ఆడియార్డ్), నికెల్ బాయ్స్ (రామెల్ రాస్ అండ్ జోస్లిన్ బార్న్స్), సింగ్ సింగ్ (క్లింట్ బెంట్లీ అండ్ గ్రెగ్ క్వెడార్) చిత్రాలు పోటీపడ్డాయి. ఈ విభాగంలో కాన్ క్లేవ్ చిత్రానికి పీటర్ స్ట్రాఘన్ పురస్కారాన్ని అందుకొన్నారు.

  • Mar 3, 2025 6:39 AM

    Best Original Screenplay (బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే):

    Best Original Screenplay (బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే) విభాగంలో అనోరా (సీన్ బేకర్), ది బ్రూటలిస్ట్ (బ్రాడీ కార్బెట్ అండ్ మోనా ఫాస్ట్‌వోల్డ్), ఏ రియల్ పెయిన్ (జెస్సీ ఐసెన్‌బర్గ్), సెప్టెంబర్ 5 (మోరిట్జ్ బైండర్, టిమ్ ఫెహ్ల్‌బామ్ అండ్ అలెక్స్ డేవిడ్) ది సబ్‌స్టాన్స్ (కోరలీ ఫార్గేట్) పోటీ పడ్డారు. అయితే ఈ కేటగిరీలో అనోరా చిత్రానికి సీన్ బేకర్ అవార్డు గెలుచుకొన్నారు.

  • Mar 3, 2025 6:28 AM

    Best Costume Design (బెస్ట్ కాస్టూమ్ డిజైన్):

    ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ క్యాస్టూమ్ డిజైన్ కేటగిరీలో ఎ కంప్లీట్ అన్ నోన్, కాన్క్లేవ్, గ్లాడియేటర్ 2, నోస్ఫెరాటు, వికెడ్ చిత్రాలు పోటీ పడ్డాయి. చివరకు ఈ అవార్డును వికెడ్ చిత్రానికి పాల్ టేజ్‌వెల్ గెలుచుకొన్నారు.

  • Mar 3, 2025 6:19 AM

    Oscar Goes to బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం

    బెస్ట్ యానిమేటేడ్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఇ ది షాడో ఆఫ్ ది సీప్రెస్ (In The Shadow of the Cypress) ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకొన్నది.

  • Mar 3, 2025 6:14 AM

    బెస్ట్ యానిమేటేడ్ ఫిల్మ్ Oscar Goes to..

    బెస్ట్ యానిమేటేడ్ ఫిల్మ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఫ్లో (Flow) అనే సినిమా అవార్డును గెలుచుకొన్నది. జింట్స్ జిల్బాలోడిస్, మాటిస్ కాజా, రాన్ డైఎయన్స్, అండ్ గ్రేగరి జాల్కన్ గెలుచుకొన్నారు.

  • Mar 3, 2025 6:03 AM

    Oscar Goes to బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్

    ఆస్కార్ అవార్డుల్లో భాగంగా తొలి అవార్డును బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిలో ప్రకటించారు. ఈ కేటగిరిలో ఉత్తమ సహాయ నటుడిగా కియెరాన్ కుల్కిన్ కు ఎ రియల్ పెయిన్ చిత్రంలో అద్బుతమైన నటనను ప్రదర్శించినందుకు అందజేశారు.

  • Mar 3, 2025 5:26 AM

    రెడ్ కార్పెట్‌పై స్కార్లెట్ జాన్సన్

    ప్రముఖ నటి స్కార్లెట్ జాన్సన్ ఆస్కార్ వేడుకలకు హాజరయ్యారు. ఆమె రెడ్ కార్పెట్‌పైకి వచ్చి అందరికి అభివాదం చేస్తూ ఆకట్టుకొన్నారు.

  • Mar 3, 2025 5:13 AM

    రెడ్ కార్పెట్‌పై ఎమ్మాస్టోన్

    ఆస్కార్ 2025 వేడుకల్లో ప్రముఖ నటి ఎమ్మా స్టోన్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. రెడ్ కార్పెట్‌పైకి రాగానే అందరి కళ్లు ఆమెపైనే దృష్టిని కేంద్రికరించాయి. మీడియా వర్గాల్లో చిన్న అలజడి కనిపించింది.

  • Mar 3, 2025 5:09 AM

    ది బ్రూటలిస్ట్ ఫేమ్ అంద చందాలతో

    ది బ్రూటలిస్ట్ ఫేమ్ ఫెలిసిటీ జోన్స్ తన అంద చందాలతో ఆస్కార్ రెడ్ కార్పెట్‌ను వేడెక్కించింది. ఆమె రెడ్ కార్పెట్ అడుగుపెట్టగానే మీడియా కెమెరాలన్నీ ఆమె గ్లామరస్‌ లుక్‌ను బందించేందుకు పోటీపడ్డాయి.

  • Mar 3, 2025 5:06 AM

    కమలా హ్యారీస్‌ హాజరు అంటూ

    ఆస్కార్ వేడుకల్లో అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ పాలు పంచుకొనే అవకాశం ఉందని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆమె రాకను దృష్టిలో పెట్టుకొని ఆస్కార్ వేదిక డాల్బీ థియేటర్ వద్ద సెక్యూరిటీని కట్టుదిట్టం చేస్తున్నారు.

  • Mar 2, 2025 3:33 PM

    ఇండియన్ ఆడియెన్స్ ఎక్కడ చూడొచ్చంటే?

    ఆస్కార్ అవార్డుల కార్యక్రమం లైవ్‌ను ఇండియాలోని సినీ అభిమానులు ABC, Hulu ఫ్లాట్ ఫామ్‌లో ప్రసారమయ్యే ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. అలాగే ఇండియాలో స్టార్ మూవీస్, జియో హాట్ స్టార్‌లో ఉదయం 5.30 గంటల నుంచి లైవ్ చూడవచ్చు.

  • Mar 2, 2025 3:33 PM

    ఎన్ని గంటలకు లైవ్ ప్రసారమంటే?

    ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో భారతీయ కాలమానం ప్రకారం జరిగే ఈవెంట్స్ వివరాలు: 12.30 గంటలకు రెడ్ కార్పెట్ కౌంట్‌డౌన్ 2 గంటలకు ఆస్కార్స్ రెడ్ కార్పెట్ ఈవెంట్ 2.30 గంటల నుంచి రెడ్ కార్పెట్ నుంచి ఆస్కార్ అవార్డుల లైవ్ ప్రారంభం

More from Filmibeat

Read more about: oscars 2025 97th academy awards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X