Oscars 2026 Live: ఆస్కార్ 2026 అవార్డుల లైవ్ ఎక్కడ? ఎప్పుడు చూడొచ్చు.. ఇండియాలో ఎన్ని గంటలకంటే?
సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమానికి అన్ని హంగులు పూర్తయ్యాయి. ఇప్పటికే భారీ ఎత్తున నామినేట్ అయిన సినిమాలపై సినీ అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఏ చిత్రం ఎన్ని అవార్డులు గెలుచుకొంటుందనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ఎక్కడ చూడొచ్చు.. ఇండియా కాలమానం ప్రకారం ఎన్ని గంటల ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే..
ప్రతిష్టాత్మకంగా భావించే 98వ అకాడమీ అవార్డుల కార్యక్రమం అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌ని డాల్బీ థియేటర్‌లో జరుగుతున్నది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం మార్చి 15వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇండియాలో మార్చి 16వ తేదీ ఉదయం 3.30 గంటలకు రెడ్ కార్పెట్ కార్యక్రమం, 4.30 గంటలకు అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది.

ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. ఈ వేడుకలో ఆమె ప్రజెంటర్‌గా వ్యవహరించబోతున్నారు. భారతీయ హీరోయిన్లలో అరుదైన గౌరవం దక్కించుకోవడం విశేషంగా మారింది. ఇక అమెరికన్ టెలివిజన్ హోస్ట్, కమెడియన్ , రైటర్ కానన్ ఓబ్రియన్ ఈ అవార్డుల కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. రెడ్ కార్పెట్ వద్ద అమెరికా నటులు టామ్రాన్ హాల్, జెస్సీ పాల్మర్ హోస్టింగ్ చేస్తున్నారు.
ఈ అవార్డుల కార్యక్రమాన్ని హులూ, డిస్నీ హాట్ స్టార్, ఇండియాలో జియో హాట్ స్టార్ ఓటీటీలు స్ట్రీమింగ్ చేస్తున్నాయి. అలాగే ఆస్కార్ యూట్యూబ్ టెలివిజన్, ఫ్యూబో టీవీ కూడా ప్రసారం చేస్తున్నది. ఇక స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్, కలర్స్ ఇన్‌ఫినిటీ టెలివిజన్ ఛానెల్స ్ కూడా ప్రసారం చేస్తున్నాయి. ఇండియాలో ఈ కార్యక్రమాన్ని మార్చి 16వ తేదీ రాత్రం 9 గంటలకు పున: ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేశారు.
ఆస్కార్ 2025 అవార్డుల వేడుకల్లో బుగోనియా, ఎఫ్1, ఫ్రాంకెన్‌స్టెయిన్, హమ్నెట్, మార్టీ సుప్రీం, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, ది సీక్రెట్ ఏజెంట్, సెంటిమెంటల్ వాల్యూ, సిన్నర్స్, ట్రైన్ డ్రీమ్స్ చిత్రాలు పోటీ పడుతున్నాయి.
బెస్ట్ యాక్టర్ కేటగిరీలో తిమోతీ చాలామెట్, లియోనార్డో డికాప్రియో, ఎతాన్ హాకే, మైఖేల్ జోర్డాన్, వాంగర్ మౌర్య పోటీ పడుతున్నారు. బెస్ట్ హీరోయిన్ కేటగిరిలో జెసపీ బక్‌లీ, రోస్ బెర్నే, కేట్ హడ్సన్, రినేట్ రీఎన్స్, ఎమ్మా స్టోన్ తదితరులు రేసులో ఉన్నారు.


Click it and Unblock the Notifications











