కేక పుట్టించే యాక్షన్ (‘ఫాస్ట్ & ఫ్యూరియస్ 8’ న్యూ ట్రైలర్)
హాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తే.... అందులో 'ఫాస్ట్ & ఫ్యూరియస్' సిరీస్ చిత్రాలకు అగ్రస్థానమే లభిస్తుంది. ఈ సిరీస్ లో వస్తున్న 8వ సీక్వెల్ 'ఫాస్ట్ & ఫ్యూరియస్ 8' 2017 ఏప
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తే.... అందులో 'ఫాస్ట్ & ఫ్యూరియస్' సిరీస్ చిత్రాలకు అగ్రస్థానమే లభిస్తుంది. ఇప్పటికే ఈ ఫ్రాంజైజీలో 7 సిరీస్ లు వచ్చాయి... అన్నీ సూపర్ హిట్టే. 2015లో వచ్చిన ఫాస్ట్ & ఫ్యూరియస్ 7 మూవీ ఇండియాలో భారీ విజయం సాధించింది. భారత్ లో రూ. 100 కోట్లు కొల్లగొట్టిన తొలి హాలీవుడ్ చిత్రంగా రికార్డులకెక్కింది.
మరో సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురు చూపులకు త్వరలోనే తెర పడబోతోంది. ఈ సిరీస్ లో వస్తున్న 8వ సీక్వెల్ 'ఫాస్ట్ & ఫ్యూరియస్ 8' 2017 ఏప్రిల్ నెలలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

న్యూ ట్రైలర్
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ విడుదలవ్వగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రెండో ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్లో చూపించిన యాక్షన్ సీన్లు మామూలుగా లేవు. మొత్తం 3 నిమిషాలకుపైగా ఉన్న ఈ ట్రైలర్లో సినిమాలో చూపించే హైలెట్ యాక్షన్ సీన్లను బాగా ఫోకస్ చేసారు.

ఫస్ట్ ట్రైలర్
డిసెంబర్లో ‘ఫాస్ట్ & ఫ్యూరియస్ 8' మొదటి ట్రైలర్ విడుదలైంది. దీనికి ఒక్క యూట్యూబ్ లోనే 15 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇతర మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ ట్రైలర్ వీక్షించారు.

‘ఫాస్ట్ & ఫ్యూరియస్ 8'
ఈ చిత్రానకి ఎఫ్ గ్యారీ గ్రే దర్శకత్వం వహించారు. విన్ డీసెల్, డ్వేన్ జాన్సన్(ది రాక్), జేనస్ స్టేటమ్ లాంటి హాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఈ సిరీస్ చిత్రాలన్నింటిలోకంటే ది బెస్ట్ గా ఇది ఉంటుందని అంటున్నారు.

అభిమానులు
‘ఫాస్ట్ & ఫ్యూరియస్' సిరీస్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ‘ది ఫాస్ట్ ఆఫ్ ది ఫ్యూరియస్' పేరుతో 8వ సిరీస్ ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











