హాలీవుడ్ :కైజుతో రోబోల యుద్దమే 'పసిఫిక్ రిమ్'
న్యూయార్క్ : అత్యాధునిక సాంకేతిక విలువలతో వార్నర్ బ్రదర్స్ సంస్థ హాలీవుడ్‌లో నిర్మించిన 'పసిఫిక్ రిమ్' చిత్రం జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అదే రోజు ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు తెలుగులోనూ ఈ సినిమా 'అంతిమ పోరాటం' పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కథానుసారం ఓ కొండ సైజు ఆకారంలో చూడ్డానికి అతి భయానకంగా ఉండే కైజు అనే రాక్షస జీవి పసిఫిక్ మహా సముద్రంలో సంచరిస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి నగరంలోకి ప్రవేశించి మనుషుల ప్రాణాల్ని బలిగొంటూ మారణకాండ సృష్టిస్తుంటుంది. దాన్ని అరికట్టడానికి మానవ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అత్యంత శక్తివంతమైన రోబోలను తయారు చేస్తారు. ఆ తర్వాత కైజుతో రోబోలు చేసే 'అంతిమ పోరాటం' వళ్లు గగుర్పాటు కలిగిస్తుంది.

ఈ తరహా యాక్షన్ సన్నివేశాలు ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ మనం చూడలేదు. ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా 2డి, 3డి వెర్షన్లలో అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నాం'' అని బాలకృష్ణ తెలిపారు. చార్లీ హున్నమ్, ఇడ్రిన్ ఇల్లా, చార్లీ డే, రాబ్ కజిన్‌స్కై, మ్యాక్స్ మార్టిన్ తారాగణమైన ఈ చిత్రానికి గులెర్మో డేల్‌టోరో దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











