»   » 16 ఏళ్ల వయసులోనే బాయ్ ఫ్రెండ్ రేప్ చేశాడు: పద్మా లక్ష్మి

16 ఏళ్ల వయసులోనే బాయ్ ఫ్రెండ్ రేప్ చేశాడు: పద్మా లక్ష్మి

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  16 ఏళ్ల వయసులోనే బాయ్ ఫ్రెండ్ రేప్ చేశాడు: పద్మా లక్ష్మి

  భారత సంతతికి చెందిన అమెరికన్ నటి, మోడల్, టీవీ హోస్ట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పద్మాలక్ష్మి తన టీనేజ్‌లో జరిగిన ఓ చేదు సంఘటన గురించి మీడియాకు వెల్లడించారు. న్యూయార్క్ టైమ్‌కు రాసిన కాలమ్‌లో.... 16 ఏళ్ల వయసులోనే తననపై అత్యాచారం జరిగిందని, 23 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్ తనపై అఘాయిత్యం చేశాడని తెలిపారు.

  తనపై జరిగిన తొలి లైంగిక దాడి గురించి ఆమె వివరిస్తూ... నా వయసు అపుడు 16 సంవత్సరాలు. లాస్ ఏంజిలెస్ లోని ఓ మాల్‌లో కలిసిన 23 ఏళ్ల వ్యక్తితో డేటింగ్ మొదలు పెట్టాను. స్కూల్ పూర్తయిన తర్వాత నేను ఆ మాల్‌లో యాక్ససెరీస్ కౌంటర్లో పని చేసేదాన్ని. అతడు హై ఎండ్ మెన్స్ స్టోర్లో పని చేసేవాడు. డేటింగ్ మొదలు పెట్టిన కొన్ని రోజులకే నాపై అత్యాచారం జరిగింది అని పద్మాలక్ష్మి గుర్తు చేసుకున్నారు.

  పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

  ఇలాంటివి బయటకు చెప్పాలి

  ఇలాంటివి బయటకు చెప్పాలి

  ఇలాంటి సంఘటనలు యంగ్ ఏజ్ ఊమెన్ మీద ప్రతి రోజూ జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు బయటకు చెప్పడం వల్ల ఎంతో కొంత మార్పు అనేది జరుగుతుంది అనేది తన నమ్మకం అని పద్మా లక్ష్మి తెలిపారు.

   నా 8 ఏళ్ల కూతురుకు చెబుతున్నాను

  నా 8 ఏళ్ల కూతురుకు చెబుతున్నాను

  నాకు ఇపుడు 8 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. ఎవరైనా మనల్ని చెడు ఉద్దేశ్యంతో టచ్ చేసిపుడు ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను ఇప్పటి నుండే ఆమెకు చెబుతున్నాను. ఎవరైనా నీ ప్రైవేట్ పార్ట్స్‌ను టచ్ చేసినా.... నువ్వు ఇబ్బంది పడే విధంగా అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే బిగ్గరగా అరవాలి అని తన కూతురును ఎడ్యుకేట్ చేస్తున్నాను అని పద్మా లక్ష్మి తెలిపారు.

   అమెరికాలో జరిగిన సంఘటనపై

  అమెరికాలో జరిగిన సంఘటనపై


  యూఎస్ఏ సుప్రీం కోర్టులో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు విచారణకు వచ్చిన నేపథ్యంలో పద్మా లక్ష్మి....తన 16వ ఏట జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకుంటూ న్యూయార్క్ టైమ్స్‌కు కాలమ్ రాశారు.

  పద్మా లక్ష్మి గురించి

  పద్మా లక్ష్మి గురించి

  పద్మాలక్ష్మి 1970, సెప్టెంబర్ 1న చెన్నైలో పుట్టింది. చిన్నతనంలో ఆమె తల్లిదండ్రులు అమెరికా షిప్టయ్యారు. ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీని 2004లో పెళ్లాడిన పద్మా లక్ష్మి 2007 అతడితో విడిపోయారు. తన బాయ్ ఫ్రెండ్ ఆడమ్ డెల్ ద్వారా పద్మా లక్ష్మి ఒక కూతురుకు జన్మనిచ్చారు.

  English summary
  Actress, model and Top Chef host Padma Lakshmi has revealed that she was raped when she was16. In an Op-Ed column for The New York Times, the former wife of author Salman Rushdie says that she was raped by her 23-year-old boyfriend.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more