twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇద్దరి మధ్య ‘సం’బంధం ఉందనడానికి ఇదే సాక్ష్యం!

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: ప్రపంచ ప్రసిద్ధ శృంగార తారగా పేరొందిన పమేలా అండర్సన్ తాజాగా మళ్లీ వార్తల్లోకెక్కింది. ఇప్పటికే చాలా మందితో గుడి ఎనకా నాసామి వ్యవహారాలు నడిపిన ఈ సెక్స్ బాంబ్ తాజాగా ట్రిస్టన్ మెక్ మానుస్‌తో డేటింగ్ చేస్తోంది. తాము ఇద్దరం డేటింగ్ చేస్తున్నాం అనే విధంగా పలు సంకేతాలు కూడా ఇచ్చింది. ఇద్దరు కలిసి మీడియా సాక్షిగా కలిసి తిరిగుతున్నారు.

    'డాన్సింగ్ విత్ ద స్టార్స్' కార్యక్రమంలో పమేలా అండర్సన్, ట్రిస్టన్ మెక్ మానుస్ కలిసి ప్రొఫెషనల్ పార్ట్నర్స్‌గా ఉన్నారు. అప్పుడే ఇద్దరి మధ్య ఎఫైర్ రగిలిందని, అది ఇప్పుడు తాజాగా డేటింగుకు దారి తీసిందని హాలీవుడ్ టాక్. ఇంగ్లండ్ చెందిన పమేలా అండర్సన్ ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ తన మాజీ మొగుడు టామీ లీతో విడిపోయిన తర్వాత చాలా మందితో సంబంధాలు పెట్టుకుందనే వార్తలు వినిపించాయి. అయితే తాను ప్రస్తుతం ఎవరితోనూ ఎఫైర్ నడపటం లేదని ప్రకటించింది.

    నా ఇద్దరు పిల్లలు బ్రాండన్, దిలార్ బాగోగులే నాకు ముఖ్యం, ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ చేయడం కబుర్లు చెప్పింది. అయితే ఇప్పుడు ఆ మాటలన్నీ మరిచిపోయి తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన ట్రిస్టన్ మెక్ మానుస్‌తో డేటింగ్ మొదలు పెట్టింది. హాలీవుడ్లో ఇలాంటివి కామనే అయినా పమేలా అండర్సన్ మాత్రం మరీ బరితెగించింది అంటున్నారు చాలా మంది.

    ఆ విషయం పక్కన పెడితే...పమేలా అండర్సన్ ఆ మధ్య బిగ్ బాస్ షోలో చీరకట్టులో అందాలు ఆరబోసిన విషయం తెలిసిందే. పమేలా అండర్సన్ నటించిన బే వాచ్ అనే అమెరికన్ టీవీ షోను ఇండియాలో ప్రారంభించబోతున్నారట. లాస్ ఏంజిల్స్ లో బీచ్ ల రక్షణకు పనిచేసే లైఫ్ గార్డ్స్ చుట్టూ తిరిగే కధాంశమే బేవాచ్... బీచ్ సందర్శకులకు ఎదురయ్యే ప్రమాదాలను, ఇబ్బందులను డేవిడ్ హాస్సలాఫ్ నేతృత్వంలోని లైఫ్ గార్డ్స్ ఎలా పరిష్కరించారు...లైఫ్ గార్డ్స్ మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి...మధ్యలో కుట్రలు, సెక్స్ రిలేషన్స్ లాంటి వాటన్నింటినీ కలిపి ఓ మసాలా టీవీ షోగా ప్రేక్షకులను అలరించింది బేవాచ్.

    ఈ సీరిస్ లో పమేలా అండర్సన్..ఎరైనా ఎలైకన్ లాంటి హాలీవుడ్ తారలు నటించడం కూడా మరింత పాపులారిటీని తెచ్చింది. ఈ హాలీవుడ్ భామలంతా బికీనీలు వేసుకొని అందాలు ఆరబోస్తూ నటించి షోను మరింత రక్తికట్టించారు. ఒక్క హీరో డేవిత్ తప్ప మిగిలిన పాత్రల్లో ఒక్కొ సీజన్ కు ఒక్కో తారను మార్చి బే వాచ్ సీరిస్ ను మరింత స్పయిసీగా రక్తి కట్టించారు. ఇప్పుడు ఈ సిరీస్ ను ఇండియాలో ప్రారంభిస్తామంటున్నాడు హీరో డేవిడ్..అయితే దీని పేరు బే వాచ్ కాకుండా బొంబే వాచ్ అనే పేరుతో తీస్తారట.

    English summary
    Pamela Anderson has sparked rumors of a budding romance with her former 'Dancing with the Stars' professional partner Tristan MacManus, after they were spotted out again together on Tuesday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X