నేను రొమాంటిక్.. అందుకే బ్రేకప్‌లూ: 52 ఏళ్ల వయసులో శృంగార తారకు నాలుగో పెళ్లి!

హాలీవుడ్ నటి పమేలా అండర్సన్ మరోసారి పెళ్లికి సిద్ధమవుతున్నారు. తాజా ఇంటర్వ్యూలో సంచలనాత్మకంగా తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది. న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకొన్న బ్రేకప్‌లు, రిలేషన్‌షిప్స్ గురించి వివరంగా చెప్పింది. ఇప్పటికే మూడుసార్లు పెళ్లి పెటాకులు అయ్యాయని, మరోసారి వివాహానికి సిద్ధమవుతున్నట్టు చెబుతూ...

ఐదో పెళ్లి అంటూ రూమర్లు..

ఐదో పెళ్లి అంటూ రూమర్లు..

పమేలా అండర్సన్ పెళ్లి వార్త ఈ ఏడాది జనవరిలో సంచలనం రేపింది. హాలీవుడ్ నిర్మాత జాన్ పీటర్స్‌ను పెళ్లి చేసుకొన్నారనే వార్త హాలీవుడ్‌లో సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. అలాగే పమేలాకు ఇది ఐదో వివాహం అంటూ కథనాలు వెల్లడించింది. అయితే తనకు ఐదో పెళ్లి కాదని, ఇది నాలుగోదేనని తాజా ఇంటర్వ్యూలో పమేలా అండర్సన్ వెల్లడించారు. 52 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకొంటున్నట్టు తెలపడం మీడియాలో చర్చనీయాంశమైంది.

మూడు బ్రేకప్‌ల తర్వాత మానసికంగా

మూడు బ్రేకప్‌ల తర్వాత మానసికంగా

మూడు పెళ్లిళ్లు బ్రేకప్ కావడంతో మానసికంగా కుంగిపోయాను. వెంటనే భారత్‌కు వెళ్లి పంచకర్మ యోగాను అభ్యసించాను. మూడు నెలలపాటు ఆయుర్వేద సెంటర్లో గడిపాను. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడంతో మనసు చాలా తేలికపడింది. తిరిగి ఇంటికి చేరుకొన్న తర్వాత జాన్ పీటర్స్‌తో రిలేషన్‌షిప్‌లో పడటం మ్యాజిక్‌లా జరిగిపోయింది అని పమేలా అండర్సన్ తన కొత్త రిలేషన్ షిప్ గురించి వెల్లడించారు.

నా జీవితంలో నాలుగో పెళ్లి

నా జీవితంలో నాలుగో పెళ్లి

నా జీవితంలో నాలుగో పెళ్లి రాసిపెట్టి ఉందేమో అందుకే మూడు పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి. ఇప్పుడు నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాను. దేవుడా ఒక్కటంటే ఒక్కసారి నాకు మళ్లీ అవకాశం ఇవ్వు. మరొక్కసారే నా దాంపత్య జీవితాన్ని గాడిలో పెట్టేలా చూడు సామి. నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రశ్నకు పమెలా అండర్సన్ జవాబు ఇచ్చారు.

మూడు పెళ్లిల్లే

మూడు పెళ్లిల్లే

నాకు మూడ పెళ్లిళ్లు మాత్రమే జరిగాయంటే వార్తలను కొట్టిపడేశారు. గతంలో నా రిలేషన్‌షిప్స్‌లో జరిగిపోవాల్సినవి జరిగిపోయాయి. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మూడు పెళ్లిళ్లు చేసుకొంటే ప్రజలంతా ఐదు పెళ్లిళ్లు చేసుకొన్నదని అనుకొంటారు. నా జీవితంలో మూడు పెళ్లిళ్లు ఎందుకు జరిగాయో నాకే తెలియదు. ఇప్పటి వరకు టామీ లీ, బాబ్ రిచీ, రిక్ సాల్మన్‌ను పెళ్లి చేసుకొన్నాను. మూడు పెళ్లిళ్లు అంటే ఎక్కువ కానీ..అవి ఐదు కంటే తక్కువేగా అని పమేలా అండర్సన్ పేర్కొన్నారు.

Recommended Video

Pawan Kalyan Key Decision On Malayalam Movie Remake
నేను రొమాంటిక్ అందుకే..

నేను రొమాంటిక్ అందుకే..

ప్రస్తుతం జాన్ పీటర్స్‌తో రిలేషన్‌షిప్ కొనసాగుతున్నది. ఇంకా పెళ్లి కాలేదు. నేను చాలా రొమాంటిక్ అందుకే నన్ను ఈజీగా బట్టలో పడేస్తున్నారేమో. ఆ కారణంగానే నేనంటే నాతో జీవించడానికి భయపడుతున్నారేమో. అనవసరపు ఆందోళనలు నా దాంపత్య జీవితాన్ని దెబ్బ తీశాయేమో అని పమేలా అండర్సన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X