Just In
- 11 min ago
Naandhi Collections.. దుమ్ములేపిన అల్లరి నరేష్.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే?
- 32 min ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
- 1 hr ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 1 hr ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
Don't Miss!
- News
Illegal affair: పెళ్లానికి పులిహోరా, ఉంచుకున్న దానికి...... ?, భార్య బంగారం, డబ్బు !
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఐదోసారి పెళ్లి చేసుకొన్న శృంగార తార.. లాక్‌డౌన్‌లో బాడీగార్డ్‌తో అఫైర్, పెళ్లి!
హాలీవుడ్ శృంగార తార, బేవాచ్ ఫేమ్ పమేలా అండర్సన్ ఐదోసారి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కాలంలో ప్రేమలో పడిన పమేలా తాజాగా మూడు మూళ్లు వేసుకొని నిత్య పెళ్లికూతురిలా మారింది. పమేలా అండర్సన్ ఐదో పెళ్లి విషయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే....

బేవాచ్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ
హాలీవుడ్‌లో బేవాచ్ లాంటి టెలివిజన్ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న పమేలా అండర్సన్ మరోసారి పెళ్లి కూతురిలా మారింది. క్రిస్మస్ సందర్భంగా కెనడాలోని వాంకోవర్ ఐలాండ్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో తన బాడీ గార్డ్‌ను ఐదో భర్తగా స్వీకరించింది. తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా అకౌంట్‌లో ప్రపంచానికి తెలియజేసింది.

ఐదో పెళ్లి గురించి పమేలా అండర్సన్ వివరణ
తన ఐదో పెళ్లి గురించి హాలీవుడ్ మీడియాతో పమేలా అండర్సన్ వివరణ ఇచ్చింది. నా జీవితానికి పరిపూర్ణత కలిగించే వ్యక్తి కోసం చాలా కాలంగా ఎదురు చూశాను. నా అంగరక్షకుడిగా ఉన్న డాన్ హేహస్ట్ నాకు జీవిత భాగస్వామిగా కరెక్ట్ అనిపించింది. నేనంటే అభిమానం, ప్రేమ కలిగిన డాన్ కంటే మంచి భర్త మరొకరు దొరకరని విశ్వసించాను. లాక్‌డౌన్ కాలంలో మేమిద్దరం ప్రేమలో పడ్డాం. దాంతో ఒక్కటి కావాలనుకొన్నాం అని పమేలా అండర్సన్ తెలిపారు.

డాన్‌తో పెళ్లితో పరిపూర్ణత
డాన్ హేహస్ట్‌తో నా పెళ్లికి ప్రత్యేకత ఉంది. 28 ఏళ్ల నుంచి నా తాత నుంచి కొనుగోలు చేసిన ప్రదేశంలో పెళ్లి చేసుకొన్నారు. నా పెళ్లికి నా కుటుంబ సభ్యులు ఆశీస్సులు పై నుంచి లభించాయని నమ్ముతున్నాను. డాన్‌తో పెళ్లి వల్ల నా జీవితానికి పరమార్థం లభించిందని భావిస్తున్నాను. మళ్లీ నా జీవితంలో ప్రశాంతత నెలకొందనే భావన ఏర్పడింది అంటూ పమేలా అండర్సన్ పేర్కొన్నారు.

సోషల్ మీడియాకు పమేలా గుడ్‌బై
పెళ్లి తర్వాత పమేలా అండర్సన్ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. నా పెళ్లి వార్తే ఇన్స్‌టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్‌లో చివరి వార్త కానున్నది. డాన్‌తో వివాహం తర్వాత మరింత స్వేచ్ఛగా జీవించాలని అనుకొంటున్నాను. ఇక సోషల్ మీడియాకు సెలవు అంటూ పమేలా అండర్సన్ పోస్ట్ పెట్టారు.

పమేలా అండర్సన్ పెళ్ళిళ్లు, భర్తల లిస్టు
ఇక పమేలా అండర్సన్ వివాహిక జీవితం విషయానికి వస్తే.. 1995లో టామ్ లీ అనే ప్రముఖుడిని పెళ్లి చేసుకొన్నారు. ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో 1998లో విడిపోయారు. ఆ తర్వాత కిడ్ రాక్‌తో వైవాహిక జీవితం 2006 నుంచి 2007 వరకు సాగింది. అనంతరం రిక్ సాల్మన్‌తో వివాహం జరిగింది. రెండేళ్లు కాపురం తర్వాత వారిద్దరు విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత జాన్ పీటర్స్‌ను నాలుగో భర్తగా స్వీకరించింది. ప్రస్తుతం పమేలాకు ఇద్దరు సంతానం ఉన్నారు. తాజాగా ఐదో భర్తగా డాన్ హేహస్ట్‌ను పెళ్లి చేసుకోవడం గమనార్హం.