twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను చంపేస్తారేమో.. మగవాడిపై అలానా.. మీటూపై పమెల్లా అండర్సన్

    |

    హలీవుడ్ దర్శకుడు హర్వే వెయిన్‌స్టెయిన్‌పై మూకుమ్మడి లైంగిక ఆరోపణలు చేయడంతో మీ టూ ఉద్యమం ఊపుందుకొన్నది. 2017 అక్టోబర్‌లో తొలిసారి హార్వేపై ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమల్లో ఇలాంటి ఉద్యమం మొదలైంది. అన్యాయానికి గురైన ప్రతీ హీరోయిన్ మీడియా ముందు దుమ్ము దులిపేస్తున్నారు. ఇలా ఓ వైపు ఉద్యమం ఊపందుకొంటుంటే హాలీవుడ్ నటి పమెల్లా అండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేమిటంటే..

    ఫెమినిజం పరిధి దాటిందని

    ఫెమినిజం పరిధి దాటిందని

    మీటూ ఉద్యమంతో బలపడుతున్న ఫెమినిజం చాలా పరిధి దాటిపోయింది. నేను కూడా ఓ ఫెమినిస్టునే. కానీ ఇప్పుడున్న ఫెమినిజం చూస్తే బోరు కొడుతున్నది. మగవాళ్లపై దాడి చేస్తూ అంగవికలాంగులను చేస్తున్నది అని పమెల్లా అండర్సన్ పేర్కొన్నారు.

    మీ టూ హద్దు మీరుతున్నది.

    మీ టూ హద్దు మీరుతున్నది.

    ప్రస్తుతం సాగుతున్న మీ టూ ఉద్యమం ఒక రకంగా హద్దు మీరిందనిపిస్తున్నది. అందుకు నా వైపు నుంచి క్షమాపణ చెబుతున్నాను. నా నోటి నుంచి వచ్చిన ఈ మాట ఎవరైనా వింటే నన్ను చంపేస్తారు అని తాజాగా బేవాచ్ షోలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

    కామన్స్ సెన్స్ లేదా

    కామన్స్ సెన్స్ లేదా

    దర్శకుడు హర్వే వెయిన్‌స్టెన్‌పై లైంగిక ఆరోపణలు చేస్తున్న హీరోయిన్లను పమెల్లా అండర్సన్ తప్పుపట్టారు. ఆయన రూమ్‌కి వెళ్లడానికి వారు తాము ఏం చేస్తున్నామో ఆలోచించాల్సింది. వారికి కనీసం కామన్ సెన్స్ కూడా లేదా అని పమెల్లా ప్రశ్నించారు.

    ఏదో ఆశించి వెళ్తే అలానే

    ఏదో ఆశించి వెళ్తే అలానే

    నీకు పరిచయం లేని, సరిగా తెలియని వ్యక్తి వద్దకు వెళ్లవద్దు. అలాంటి వారిని కలువాల్సి వస్తే ఎవరినైనా తోడు తీసుకెళ్లమని నా తల్లి చెప్పేది. ఆమె మాటలు నేను ఎప్పుడు గుర్తుంచుకొంటాను. ఏదో ఆశించి వెళితే ఇలాంటివే జరుగుతుంటాయి అని పమెల్లా పేర్కొన్నది.

    బాలీవుడ్‌ను తాకిన మీటూ

    బాలీవుడ్‌ను తాకిన మీటూ

    హాలీవుడ్‌లో విజృంభిస్తున్న మీటూ ఉద్యమం ప్రస్తుతం బాలీవుడ్‌ను బలంగా తాకింది. హార్న్ ఒకే ప్లీజ్ చిత్రం షూటింగ్ సందర్భంగా సెట్లో నటుడు నానా పాటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని లైంగిక ఆరోపణలు చేసింది. ఆ తర్వాత సుభాష్ ఘాయ్, సాజిద్ ఖాన్, వికాస్ బెహల్, రజత్ కపూర్ తదితరులపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

    English summary
    Pamela Anderson slammed the movement on Baywatch talk show. Right now, In Hollywood.. Me Too movement has received overpowering support from people. There are many who have expressed their reservations about it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X