అది క్రూరత్వమే: ఐస్ బకెట్ చాలెంజ్ తిరస్కరించిన బ్యూటీ

ఏఎల్ఎస్ క్యాన్సర్ చారిటబుల్ ట్రస్టుకు విరాళం ఇవ్వడంలో భాగంగా ఈ ఐస్ బకెట్ చాలెంజ్ జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ ఐస్ బకెట్ చాలెంజ్‌ను తిరస్కరించిన వారంటూ ఎవరూ లేరు. అయితే తొలిసారిగా ప్రముఖ హాలీవుడ్ నటి పమేలా అండర్సన్ మాత్రం ఈ ఐస్ బకెట్ చాలెను తిరస్కరించి వార్తల్లోకి ఎక్కింది. ఏఎల్ఎస్ సంస్థపై కోపంతో ఆమె ఈ ఐస్ బకెట్ చాలెంజ్ తిరస్కరించింది.
జంతు సంరక్షణ ఉద్యమ కార్యకర్తగా ఉన్న పమేలా అండర్సన్....ఏఎసల్ఎస్ సంస్థ జంతువులపై చేస్తున్న ప్రయోగాలను వ్యతిరేకిస్తూ ఈ ఐస్ బకెట్ చాలెంజ్‌ను తోసి పుచ్చింది. మానవుల వ్యాధుల నివారణకు ప్రయోగాలు జరగాలి. కానీ అందుకు ప్రయోగాల పేరుతో జంతువులను బలి చేయకూడదు. వాటిని బలిచేయడం క్రూరత్వమే అంటూ ఫేస్ బుక్ పేజీలో వ్యాఖ్యానించింది.


Click it and Unblock the Notifications











