అతనితో జీవితాన్ని కలలో కూడా ఊహించుకోలేను

By Kuladeep

అమెరికా నటి, గ్లామర్ మోడల్ పమీలా ఆండ్రిసన్ తన మాజీ భర్త టామీ లీ తో తిరిగి కలసిపోనుందని వస్తోన్న వార్తల్లో నిజం లేదని, అతనితో తిరిగి కలసి జీవించాలనే ఆసక్తి తనకి లేదని పమీలా స్పష్టం చేసింది. 1995లో వివాహం చేసుకున్న వీరిద్దరూ, మూడేళ్ల తర్వాత 1998లో విడాకులతో విడిపోయారు. ఆ తర్వాతి కాలంలో తిరిగి ఎన్నో సార్లు రొమాన్స్ చేసిన వీరిద్దరూ తిరిగి కలసిపోనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఆ చెవి, ఈ చెవిన పడిన ఈ వార్తలు చివరకు పమీలా చెవిన కూడా పడటంతో ఖంగుతిన్న పమీలా అసలు తనకా ఉద్దేశ్యమే లేదని తేల్చిపారేసింది.

టామీ తనని, తన పిల్లలని ఎంతో బాధపెట్టాడని, పది సంవత్సరాల నరకం తర్వాత తాము ఇప్పుడిప్పుడే సంతోషంగా బ్రతుకుతున్నామని.. అలాంటిది తిరిగి టామీని తన జీవితంలోకి ఆహ్వానించి మరో తప్పు చెయ్యలేనని చెప్పుకొచ్చింది. అలాగని టామ్ ను నేను తప్పుబట్టడం లేదని, తనకు నచ్చిన విధంగా అతడు వుండవచ్చని అయితే అతనితో తిరిగి కలసిపోవాలనే ఆలోచన తనకు కలలో అయినా రాదని దయచేసి ఇలాంటి వార్తలను పుట్టించవద్దని మీడియాకు మనవి చేసుకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X