పదమూడవ సారి ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై అందాలను ప్రదర్శించిన పమేలా..
పమేలా ఆండర్సన్ పదమూడవ సారి తన అందాలను ప్లేబాయ్ మ్యాగజైన్ మీద ప్రదర్శించడానికి రెడీ అయ్యారు. అంతేకాకుండా 57 సంవత్సరాలు ఘన చరిత్రకలిగినటువంటి ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై పదమూడు సార్లు తన అందాలను దర్శనమిచ్చి రికార్డు నెలకోల్పారు. ఈసారి కనిపించేటటువంటి ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని అంటున్నారు. 1960లో బేవాచ్ బేబి అనిత ఏక్ బర్గ్ నటించినటువంటి సినిమా లా డోల్కీ వీటా లో హీరోయిన్ అనిత ఏక్ బర్గ్ ఒక సినిమాలో తను అర్దనగ్నంగా బ్లాక్ డ్రస్సుని ధరించి, తన వెంట్రుకలను తన శరీరంపై కవర్ చేసుకుంటూ నటించినటువంటి సీన్ మాదిరే పమేలా ఆండర్సన్ కూడా ఈసారి నటించిందని సమాచారం.
ఈ నలబైమూడు సంవత్సరాల చిన్నది మొట్టమొదటి సారి ప్లేబాయ్ కవర్ పేజి కవర్ గా 1989లో దర్శనమిచ్చింది. ప్లేబాయ్ మ్యాగజైన్ అంటే యావత్ ప్రపంచం మొత్తం పేరుగాంచిన మ్యాగజైన్. ఈ మ్యాగజైన కవర్ పేజికోసం ఎంతోమంది మోడల్స్ పోటీపడుతుంటారు. ఇలాంటి పోటీలో మన పమేలా ఆండర్సన్ పదమూడు సార్లు తన అందాలను ప్రదర్శించింది. ప్లేబాయ్ మ్యాగజైన్ హెడ్ హుగ్ హెఫ్నర్ పోయిన అక్టోబర్ లో పమేలా ఆండర్సన్ నటిస్తున్నటువంటి ఇటాలియన్ సినిమా స్విమ్మంగ్ పూల్ సీన్ నుతన ట్విట్టర్ ద్వారా తెలియజేసిన విషయం అందరికి తెలిసిందే..


Click it and Unblock the Notifications











