ఇకపై బికినిలలో దర్శనమిచ్చే ప్రసక్తే లేదంటున్న హీరోయిన్...!
పమేలా ఆండర్సన్ హాలీవుడ్ ఒకప్పటి కలల రాణి. ఈమె అందంతో హాలీవుడ్ ని ఒకఊపు ఊపింది. ఒకానోక టైంలో ప్లేమేట్ అఫ్ ద మంత్ గా ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజి లో దర్శనమిచ్చింది. టామ్ లీని పెళ్శి చేసుకోని హాయిగా సంసారం చేసుకుంటున్నారు. ప్లే బాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై ఇచ్చినటువంచి ఫోజు వల్ల తను కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటోంది.
టామ్ లీని పెళ్శి చేసుకోవడం వల్ల పమేలా ఆండర్సన్ కి ఇద్దరు పుత్రులు కలిగారు. ఈ సుపుత్రులు ఇద్దరూ వాళ్శ అమ్మని కామెంట్ చేయడం మెదలుపెట్టారంట. దానికి కారణం ప్లేబాయ్ మ్యాగజైన్ కి పమేలా ఆండర్సన్ ఇచ్చినటువంటి ఫోజు గురించి వీరిద్దరూ వాళ్శ అమ్మని ఎగాతాళి చేస్తున్నారని ఇటీవల పమేలా ఆండర్సన్ ఆరోపించడం జరిగింది. దానితో అలిగిన పమేలా ఆండర్సన్ ఇక మీదట అలాంటి బికిని ఫోజులకు స్వస్తి చెప్పినట్టు సమాచారం. ఇంతవరకు చేసింది చాలు ఇక మీదట తాను అలాంటి సీన్లలో నటించనని ఖరాఖండిగా చెప్తోంది మన పమేలా ఆండర్సన్. అంతేకాకుండా నా ప్రక్కన ఉన్న వాళ్శు మిగతా టీమ్ ని లీడ్ చేసే వాళ్శ ఇక మీదట వారు బికిని సీన్లలో నటిస్తారని అన్నారు. ఇక తనకి విశ్రాంతి కావాలని అంతేకాకుండా నేను నా జీవితాన్ని కెనడాలోని జంతువులతో హాయిగా కాలం గడుపుతానని అంటోంది. పమేలా ఆండర్సన్ పెద్ద స్క్రీన్ తో పాటు చిన్న స్క్రీన్ మీద కూడా హామ్ ఇంప్రోవ్ మెంట్, బే వాచ్ లాంటి రియాలిటి కార్యక్రమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











