ఎయిర్ పోర్టులో పరాభవం పోందిన హాటల్ బిజినెస్ మ్యాన్ కూతురు..!
పారిస్ హిల్టన్ ఈ పేరు మనకి బాగా సుపరిచితం. దానికి కారణం ఈమెను పోయిన నెలలో లాస్ వేగాస్ లో అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కారణం ఈమె వెళ్తున్న కారుని ఆపి సోదాచేసినటువంటి పోలీస్ ఆఫీసర్ కు 0.8గ్రాముల కోకైన్ ఈమె పర్సు లో దోరికిన విషయం మన అందిరికి తెలిసిందే. దీనికి గాను యుఎస్ జడ్జి ఈమెకు 2000డాలర్లు ఫైన్ తో పాటు 200 గంటలు కమ్యూనిటి సర్వీస్ చేయాల్సిందిగా శిక్ష విధించారు. పారిస్ హిల్టన్ స్వస్దలం న్యూయార్క్. పారిస్ హిల్టన్ ను లాస్ వేగాస్ లో అరెస్టు చెయ్యడం జరిగింది కాబట్టి సంవత్సరం పాటు ఇక్కడే జైలు శిక్ష అనుభవించాల్సిందేనని జడ్డి గారు తీర్పుని ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.
పారిస్ హిల్టన్ కు హాటల్ బిజినెస్ ఉండడం వల్ల బిజినెస్ కు సంబందించిన వ్యవహారాల నిమిత్తం జపాన్ రాజధాని టోక్యోకి వెళ్శవలసి ఉంది. దాంతో టోక్యోకి వెళ్శిన పారిస్ హిల్టన్ కు పరాభవం ఎదురైంది. దానికి కారణం ఆమె డ్రగ్స్ తీసుకోవడమే. ఈ విషయం పై పారిస్ హిల్టన్ ను జపాన్ లోకి అనుమతించాల వద్దా అనే విషయంపై ఎయిర్ పోర్టు అధికారులు కూలంకుషంగా చర్చించడం జరిగింది. పారిస్ హిల్టన్ ను అప్పటి వరకు ఎయిర్ పోర్ట్ రెస్ట్ హౌస్ లో ఉంచడం జరిగింది. చివరగా అధికారులు ఆమెను న్యూయర్క్ కు తిరిగివెళ్శిపోమ్మని చెప్పడం జరిగింది. దాంతో తనతో పాటు తన చెల్లి నైకి ఇద్దరూ తిరిగి తమ సోంత ప్రయువేట్ జెట్ లో తిరిగి న్యూయార్క్ వెళ్శిపోవడంతో పారిస్ హిల్టన్ యొక్క జపాన్ ట్రిప్ప్ కాన్సిల్ అయుంది. ఈ సందర్బంగా ఎయిర్ పోర్ట అధికారులు మాట్లాడుతూ అత్యవసర పరిస్దితులలో మాత్రమే కొంత మందిని లోనికి పంపంచడం జరుగుతుందని అన్నారు. కాని పారిస్ హిల్టన్ పరిస్దితి అలా లేదని వారు వివరించారు. ప్రస్తుతం ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ మరియు డ్రగ్స్ తీసుకుందని అందుకే ఆమెను నిరాకరించామని తెలిపారు.


Click it and Unblock the Notifications











