ఇద్దరు యువకులపై లైంగిక దాడి లీక్.. మైఖేల్ జాక్సన్ కుమార్తె సూసైడ్ అటెంప్ట్!

తన స్టెప్పులు, గాత్రంతో మైఖేల్ జాక్సన్ ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించారు. 2009లో మైఖేల్ జాక్సన్ మరణించిన సంగతి తెలిసిందే. మైఖేల్ జాక్సన్ డ్రగ్స్‌కి బానిసగా మారిన తర్వాత అతడి మరణం విషాదాంతంగా ముగిసింది. మైఖేల్ మరణం తర్వాత అతడి కుటుంబం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా మైఖేల్ జాక్సన్ కుమార్తె ప్యారిస్ జాక్సన్ వివాదాస్పద సంఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. ప్యారిస్ జాక్సన్ మోడల్‌గా, నటిగా రాణిస్తోంది. తాజాగా ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి.

చేయి కోసుకుని

చేయి కోసుకుని

మైఖేల్ జాక్సన్ కుమార్తె ప్యారిస్ జాక్సన్ లాస్ ఏంజల్స్ లోని తన నివాసంలో చేయి కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన భారత కాలమానం ప్రకారం ఆదివారం జరిగింది. వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించడంలో ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. ప్యారిస్ జాక్సన్ ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయాన్ని లాస్ ఏంజల్స్ పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమెర్జెన్సీ సర్వీస్

ఎమెర్జెన్సీ సర్వీస్

ప్యారిస్ ఆత్మహత్య ప్రయత్నం చేసిన వెంటనే ఆమె నివాసానికి ఎమర్జన్సీ సర్వీసులు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పారిస్ కుటుంబ సభ్యులు కూడా ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం నిజమే అంటున్నారు. కానీ ప్యారిస్ జాక్సన్ మాత్రం తనపై వస్తున్న వార్తలని ఖండిస్తోంది. అమెరికాలోని పలు మీడియా సంస్థలు ప్యారిస్ జాక్సన్ ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించిందో కూడా రాసేస్తున్నారు.

యువకులపై లైంగిక దాడి

యువకులపై లైంగిక దాడి

ప్యారిస్ తన తండ్రి మైఖేల్ జాక్సన్ పై వస్తున్న ఓ వార్త నేపథ్యంలో మనస్తాపానికి గురైందని, అందువలనే ఆత్మహత్యకు ప్రయత్నించిందని అంటున్నారు. మైకేల్ జాక్సన్ జీవితంపై లీవింగ్ నెవర్ ల్యాండ్ అనే డాక్యుమెంటరీ తీశారు. అందులోని ఓ సంఘటన లీక్ అయింది. మైకేల్ జాక్సన్ ఇద్దరు టీనేజ్ యువకులపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ డాక్యుమెంటరీలో ఉంది. ఆ విషయం బయటకు రావడంతో ప్యారిస్ జాక్సన్ తీవ్ర మనోవేదనకు గురైందట. తన తండ్రి ప్రతిష్టని దిగజార్చుతున్నారనే కోపంతో సూసైడ్‌కు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

2013లో కూడా

2013లో కూడా

ప్యారిస్ జాక్సన్‌కు చిన్న కష్టం ఎదురైనా సూసైడ్ చేసుకునే అలవాటు ఉందేమో. ఆమె సూసైడ్‌కు ప్రయత్నించడం ఇదేం కొత్త కాదు. 2013లో డిప్రెషన్ కారణంగా ఓ సారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ తాను మాత్రంసూసైడ్ చేసుకునేంత పిరికిదాన్ని కాదంటూ మీడియాపై విరుచుకుపడుతోంది. ప్రస్తుతం ప్యారిస్ జాక్సన్ గ్లెన్ అనే యువకుడితో రిలేషన్ లో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X