For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్ తప్ప అంతా పిండుకొన్నాడు.. దర్శకుడి గురించి హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

    |

    ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ 2019 అవార్డుల సందర్భంగా హాలీవుడ్ నటి పాట్రిసియా క్లార్క్‌సన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక వేధింపుల ఉద్యమం మీటూ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో పాట్రిసియా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. షార్ప్ అబ్జెక్ట్స్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రపంచ మీడియాలో ఆసక్తిని రేకేత్తించాయి. ఆమె ఏమన్నారంటే..

    షార్ప్ ఆబ్జెక్ట్‌లో ఉత్తమ నటన

    షార్ప్ ఆబ్జెక్ట్‌లో ఉత్తమ నటన

    షార్ప్ ఆబ్జెక్ట్ చిత్రంలో అద్బుతమైన నటనా ప్రదర్శనకు గాను 2019 గోల్డెన్ గ్లోబ్ అవార్డును ప్యాట్రాసియా క్లార్క్సన్ అందుకొన్నారు. ఈ చిత్రం లిమిటెడ్ సిరీస్ లేదా టెలివిజన్ కోసం ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో నటించినందుకు ఆమెకు ఉత్తమ సహాయనటి అవార్డు వరించింది.

    జీన్ మార్క్ వాల్లీపై ప్రశంసలు

    జీన్ మార్క్ వాల్లీపై ప్రశంసలు

    ప్యాట్రాసియా క్లార్క్సన్ అవార్డును అందుకొంటూ దర్శకుడు జీన్ మార్క్ వాల్లీపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కోసం సెక్స్ అడగడం తప్ప దర్శకుడు తన వద్దనుంచి అంతా పిండుకొన్నారు. అదే నాకు బాగా నచ్చింది. ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉంది అని ప్యాట్రాసియా అన్నారు. దాంతో వేదిక వద్ద ప్రముఖులు ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు.

    ప్యాట్రిసియా పాత్ర ఇదే..

    ప్యాట్రిసియా పాత్ర ఇదే..

    షార్ప్ ఆబ్జెక్ట్స్ చిత్రంలో పరిణతి చెందిన మహిళగా, భార్యగా, తల్లిగా పలు షేడ్స్ పాత్రను అద్భుతంగా పోషించింది. ఈ చిత్రంలోని ఆమె పోషించిన పాత్ర సినీ విమర్శకుల ప్రశంసలకు నోచుకొన్నది. ఈ అవార్డును విలియయ్ హెచ్ మాసీ, ఫెలిసిటీ హాఫ్‌మన్ చేతుల మీదుగా అందుకొన్నారు.

     2019లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల జాబితా ఇలా ఉంది..

    2019లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల జాబితా ఇలా ఉంది..

    ఉత్తమ దర్శకుడు: రోమా
    ఉత్తమ చిత్రం డ్రామా: బోమెమియన్ రాప్సోడే
    ఉత్తమ చిత్రం కామెడీ: గ్రీన్ బుక్
    ఉత్తమ నటుడు డ్రామా: రామి మాలెక్ (బోమెమియన్ రాప్సోడే)
    ఉత్తమ నటుడు కామెడీ: క్రిస్టియన్ బాలే (వైస్)
    ఉత్తమ నటి డ్రామా: గ్లెన్ క్లోజ్ (ది వైఫ్)
    ఉత్తమ నటి కామెడీ: ఓలివా కోల్మన్ (ది ఫేవరేట్)

    English summary
    Patricia Clarkson, who won her first Golden Globe Award at the 2019 ceremony for her performance in Sharp Objects, praised the show's director Jean-Marc Vallee for "demanding" everything from her but sex, in apparent reference to the various #MeToo cases in Hollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X