Don't Miss!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రేయసి నుండి విడిపోయిన తర్వాత తొలి సారి టెలివిజన్ షోలో
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ అందగాడు రాబర్ట్ ప్యాటిన్సన్ తాను ఎంతగానో ప్రేమించిన ప్రేయసి క్రిస్టినా స్టివార్ట్ చేతిలో మోసపోయిన తర్వాత మొదటిసారి పబ్లిక్ లోకి ఓ టెలివిజన్ షో ద్వారా వస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టినా స్టివార్ట్ ఇద్దరూ ఎంతో గాఢంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఐదే ఇటీవల క్రిస్టినా స్టివార్ట్ తన ప్రియుడు రాబర్ట్ ప్యాటిన్సన్కి హ్యాండ్ ఇచ్చి 'స్నో వైట్ అండ్ ద హంట్స్ మ్యాన్' సినిమా డైరెక్టర్ రూపెర్ట్ సాండర్స్తో రొమాన్స్ చేస్తూ దొరికిపోయింది.
దీంతో రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టినా స్టివార్ట్ ఇద్దరూ విడిపోయారు. వీరిద్దరూ విడిపోయిన విషయం, క్రిస్టినా స్టివార్ట్, రూపెర్ట్ సాండర్స్ రొమాన్స్ పై ఇప్పటి వరకు పెదవి విప్పక పోవడం విశేషం. అంతేకాకుండా మొన్నటి వరకు వీరిద్దరూ కలిసి సహా జీవనం సాగించిన లాస్ ఏంజిల్స్ ఇంటి నుండి వెళ్లి పోయారు. ఇది ఇలా ఉంటే ప్రపంచంలో అత్యధిక సంపాదనను ఆర్జించే స్టార్ హీరోయిన్గా హాలీవుడ్ హీరోయిన్ క్రిస్టిన్ స్టివార్ట్ మొదటి స్దానాన్ని కైవసం చేసుకుంది. క్రిస్టినా స్టివార్ట్ గతయేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వార్షిక ఆదాయం £22mగా ఉందని ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన తన నివేదికలో పేర్కొంది. క్రిస్టినా స్టివార్ట్ నటించిన హాలీవుడ్ బంఫర్ బాక్సాఫీసు సినిమాలైన ట్విలైట్ సిరిస్లలో నటించినందుకు గాను దాదాపు £8m వరకు పారితోషకం తీసుకుందని సమాచారం.
ఈ విషయం తెలిసిన రాబర్ట్ ప్యాటిన్సన్ గత కొంత కాలంగా మీడియా ముందుకు రాలేదు. ఐతే 26 సంవత్సరాల వయసు కలిగిన రాబర్ట్ ప్యాటిన్సన్ ఇప్పుడు తన కొత్త సినిమా 'కాస్మోపోలీస్' ప్రమోషన్లో భాగంగా 'ది డైలీ షో' అనే టెలివిజన్ షోలో పాల్గొంటున్నాడు. లేట్ నైట్ ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో రాబర్ట్ ప్యాటిన్సన్తో పాటు 'కాస్మోపోలీస్' సినిమాలో నటించిన కమెడియన్ జాన్ స్టివార్ట్ కూడా పాల్గొంటున్నాడు.
తెలుగు వన్ఇండియా