For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లనే డిన్నర్ డేట్

    By Nageswara Rao
    |

    లాస్ ఏంజిల్స్: తన భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత రెండు నెలలు పాటు ప్రముఖ గిటారిస్ట్ జాన్ మేయర్‌తో డేటింగ్ చేసిన సింగర్ కాటి పెర్రి హాలీవుడ్ అందగాడు రాబర్ట్ ప్యాటిన్సన్‌తో డిన్నర్ డేట్ చేస్తూ మీడియాకు దొరికిపోయారు. ఇక రాబర్ట్ ప్యాటిన్సన్ విషయానికి వస్తే తాను ఎంతగానో ప్రేమించిన క్రిస్టినా స్టివార్ట్ మోసం చేసి 'స్నో వైట్ అండ్ ద హంట్స్ మ్యాన్' సినిమా డైరెక్టర్ రూపెర్ట్ సాండర్స్‌తో రొమాన్స్ చేస్తూ దొరికిపోవడంతో , క్రిస్టినా స్టివార్ట్ నుండి రాబర్ట్ ప్యాటిన్సన్ విడిపోయారు.

    దీంతో ఇద్దరూ మనసులు గాయపడడంతో తీరిగ్గా సేదతీరేందుకు లాస్ ఏంజిల్స్‌లోని సోహో హౌస్‌లో డిన్నర్‌ని ఎంజాయ్ చేశారు. కాటి పెర్రి, రాబర్ట్ ప్యాటిన్సన్ ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లనే ఇలా డిన్నర్ డేట్‌కి రావడం క్రిస్టినా స్టివార్ట్ తనని ఏవిధంగా మోసం చేసిందో తదితర అంశాలను కాటి పెర్రికి చెప్పుకోని బాధపడినట్లు సమాచారం.

    హాలీవుడ్‌లో బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన 'స్నో వైట్ అండ్ ద హాంట్స్ మ్యాన్' సినిమాలో హీరోయిన్‌గా నటించిన క్రిస్టినా స్టివార్ట్ తదుపరి సీక్వెల్‌లో హీరోయిన్‌గా నటించడం లేదు. కారణం దీని తదుపరి భాగంలో సినిమా మొత్తం హాంట్స్ మ్యాన్ ఆధారంగా తీయనున్నారు. దీంతో స్నో వైట్ పాత్రని పూర్తిగా కట్ చేయనున్నారు. మొదటి పార్ట్‌లో క్రిస్టినా స్టివార్ట్ స్నో వైట్‌గా నటించిన విషయం తెలిసిందే.

    ఇక ఈ సినిమాని యూనివర్సల్ పతాకంపై నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్‌కు దర్శకత్వం వహించిన రూపెర్ట్ సాండర్స్ దర్శకత్వం వహిస్తారా లేదా అనేది ఇంకా నిర్దారణ కాలేదు. ఐతే ఈ సినిమాకి దర్శకత్వం వహించడానికి గాను ఎంపిక చేసిన దర్శకులలో రూపెర్ట్ సాండర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియిజేస్తాం.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Singer Katy Perry, who has reportedly split from John Mayer, was spotted dining with actor Robert Pattinson, whose ex-girlfriend, actress Kristen Stewart recently cheated on him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X