నేనోక లెస్బియన్ ని...ఎవరేమనుకున్నా డోంట్ కేర్
హాలీవుడ్ నటి క్రిస్టినా స్టివార్ట్ తన మీద వస్తోన్న పుకార్లను చాలా తెలివిగా ఎదుర్కొంటోంది. తన సహనటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ తో డేటింగ్ చేస్తోందని వస్తోన్న ఆరోపణలను తిప్పికొట్టడానికి తనని తాను లెస్బియన్ అని ప్రకటించుకొందట. ది న్యూయార్క్ డైలీ న్యూస్ పత్రిక తో మాట్లాడిన ఆమె "తను రాబర్ట్ తో డేటింగ్ చేస్తున్నాననే వార్తలకు అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అయినా ఈ ప్రశ్న నన్నెవరైనా అడిగితే నేనొక లెస్బియన్ ని అలాంటప్పుడు రాబర్ట్ తో డేటింగ్ ఏంటీ ఛండాలంగా" అంటూ బదులిస్తానని చెప్పింది.
చాలా తెలివిగా పుకార్లను ఎదుర్కోవాలని క్రిస్టినా చేసిన ప్రయత్నం కాస్త ఆమెను కొత్త వివాదంలో నెట్టినట్టు లేదూ... అనవసరంగా తనని తాను లెస్బియన్ అని ప్రకటించి తప్పు చేసిందని ఆమె సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. అయినా క్రిష్టినా ఇవేవీ పట్టించుకొనే స్థితిలో లేదు.. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటోంది...


Click it and Unblock the Notifications











