షర్ట్ తీసి యాక్టింగ్ చేయడం నాకు నచ్చదు..!
గత మూడు సంవత్సరాలుగా ప్రపంచంలో సెక్సీయస్ట్ మ్యాన్ స్దానాన్ని కైవసం చేసుకున్న ట్విలైట్ స్టార్ 'రాబర్ట్ ప్యాటిన్సన్' ఇటీవల ఓ ప్రముఖ ఇంటర్యూలో మాట్లాడుతూ టాప్‌లెస్ యాక్టింగ్ తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేశాడు. నా కంటూ ఓ ప్రత్యేకమైన స్దానం ఉంది. కానీ ఇటీవల సినిమాల్లో ప్రతి ఒక్క హీరో కూడా షర్ట్ తీసేసి నటించే సన్నివేశాల్లో ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇది నాకు చాలా క్రేజీగా అనిపించిందని అన్నారు.
ఇంకా చెప్పాలంటే మీరు ఒకానోక సన్నివేశంలో సహాజ సిద్దంగా ఉండే అబ్బాయి మాదిరి నడవాల్సి వస్తుంది. అటువంటి సందర్బంలో మీరు 12 ప్యాక్ బాడీతో నడిస్తే సీను పండడం అలా ఉంచి చూసే వారికి నవ్వుని తెప్పిస్తుందని అన్నారు. ప్రపంచంలో సెక్సీయస్ట్ మ్యాన్ ఎవరూ అంటూ ఇటీవల హాలీవుడ్లో టాప్ 50 మంది సెలబ్రటీలను తీసుకొని నిర్విహించిన ఓ సర్వే 'రాబర్ట్ ప్యాటిన్సన్' మొదటి స్దానాన్ని కైవసం చేసుకున్నారు.
ఇది ఇలా ఉంటే తన నిజ జీవితంలో గర్ల్ ప్రెండ్ క్రిస్టెన్ స్టివార్ట్ 'ఆన్ ద రోడ్' సినిమాలోని పాత్ర డిమాండ్ చేసిందని టాప్ లెస్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాని జాక్ కెరౌయాక్ యొక్క నవల ఆధారంగా తీస్తున్నారు. ఈ సినిమాలో 21సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టెన్ స్టివార్ట్ యొక్క అందాలను కెమెరాల ద్వారా పలు యాంగిల్స్ చూపించి చూపించకుండా.. కనిపించి కనిపించకుండా తీస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











