కొత్త జేమ్స్ బాండ్ చిత్రం: హీరో, హీరోయిన్, విలన్ వీరే

ముఖ్యంగా జేమ్స్ బాండ్ భామల ప్రత్యేకతే వేరు. ఇప్పుడు తొలిసారిగా స్పానిష్ అందగత్తె పెనెలప్ క్రజ్‌ను ఆ అదృష్టం వరించనుంది. జేమ్స్ బాండ్ 24వ సినిమాలో ఆమెను తీసుకున్నట్టు చెబుతున్నారు. ఫ్రాన్స్‌కి చెందిన ప్రీమియర్ మ్యాగజైన్ అయితే హీరోయిన్ పాత్రకే ఆమెను ఎంపిక చేస్తున్నారని రాసుకొచ్చింది.
ఇదే నిజమైతే బాండ్ చరిత్రలో ఎక్కువ వయసున్న తొలి హీరోయిన్ ఈమే కానుంది. ఎందుకంటే క్రజ్‌కి 39 ఏళ్లు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది నవంబరు 6న విడుదల చేస్తారు. ఇందులో డేనియల్ క్రెగ్ హీరో.
ఆస్కార్ అవార్డులు పొందిన '12 ఇయర్స్ ఎ స్లేవ్' సినిమాలో నటించిన ఛివెటెల్ ఇజియోఫోర్ ఇందులో విలన్ గా కనిపించబోతున్నారు. గత బాండ్ సినిమాలో బాస్‌గా నటించిన జూడీ డెంచ్ పాత్ర ముగియడంతో కొత్త బాస్ పాత్రలో రాల్ఫ్ ఫియెన్నెస్‌ను తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











