ఆల్బమ్ ద్వారా వచ్చిన సొమ్ముని ఛారిటీ సంస్దలకు..!
పాప్ స్టార్ కాటి పెర్రీ తాను కొత్తగా రూపొందించిన సింగిల్ ఆల్బమ్ "పార్ట్ ఆఫ్ మి" ద్వారా సేకరించిన డబ్బుని ఛారిటీకి విరాళంగా ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ ఆల్బమ్ ద్వారా వచ్చిన లాభాలను 'ఆర్టిస్ట్ ఛారిటీ ముసికేర్స్ ఫౌండేషన్'కు అందజేయనున్నారు. 'ఆర్టిస్ట్ ఛారిటీ మ్యూసికేర్స్ ఫౌండేషన్'లో ఎవరైతే మ్యూజిషియన్స్ ఇబ్బందులను ఎదుర్కుంటున్నారో వారికి అందజేయనుంది.
ఈ సందర్బంలో కాటి పెర్రి తన ట్విట్టర్ ఎకౌంట్‌లో "పార్ట్ ఆఫ్ మి" ఆల్బమ్‌కి ఐట్యూన్స్ లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చిన సొమ్ము మొత్తాన్ని నా అభిమాన స్వచ్చంద సేవా సంస్దలలో ఒకటైన ఆర్ట్స్, మ్యూసికేర్స్‌కు ఇస్తానని ట్వీట్ చేశారు. గ్రామీ అవార్డుల కార్యక్రమం తర్వాత "పార్ట్ ఆఫ్ మి" ఆల్బమ్ సాంగ్స్‌ని ఐట్యూన్స్‌లో పెట్టిన కొన్ని గంటలకే టాప్ టెన్‌లో చోటు సంపాదించుకున్నాయి.


Click it and Unblock the Notifications











