twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పార్టీలో ప్రెండ్స్‌తో ఎంచక్కా ఎంజాయ్ చేశా: కాటి పెర్రీ

    By Nageswara Rao
    |

    లాస్ ఏంజిల్స్, జూన్ 28: హాలీవుడ్ సింగర్ కాటి పెర్రీ తాను కొత్తగా నటించిన సినిమా 'కాటి పెర్రీ: పార్ట్ ఆప్ మి' స్క్రీనింగ్ మంగళవారం జరిగింది. ఈ సినిమా స్క్రీనింగ్‌ను వీక్షించేందుకు గాను రాబర్ట్ ప్యాటిన్సన్, జస్టిన్ బైబర్ మరియు సెలెనా గోమెజ్‌లను కాటి పెర్రీ ఆహ్వానించడం జరిగింది. ఈ స్క్రీనింగ్ లాస్ ఏంజిల్స్‌లోని చాటూ మార్మెంట్ హోటల్‌లో జరిగింది. ఈ సినిమా స్క్రీనింగ్ అనంతరం కాటి పెర్రీ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత రాబర్ట్ ప్యాటిన్సన్, జస్టిన్ బైబర్ మరియు సెలెనా గోమెజ్‌లతో మంచి సమయం గడిపానని అన్నారు.

    ఈ సినిమా స్క్రీనింగ్ అనంతరం అందరూ కలిసి హాలీవుడ్ హీరో 'డేవిడ్ ఆర్క్వెట్'కు చెందిన నైట్ క్లబ్‌ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గోన్నారు. రాబర్ట్ ప్యాటిన్సన్, కాటి పెర్రీ మంచి స్నేహితులు అవడంతో పిలవగానే ఈ నైట్ క్లబ్‌ ఓపెనింగ్‌కు వచ్చినందుకు సంతోషంగా ఉందని డేవిడ్ తెలిపారు. ఇక రాబర్ట్ ప్యాటిన్సన్, జస్టిన్ బైబర్, సెలెనా గోమెజ్‌ మరియు కాటి పెర్రీని అక్కడ చూసిన అభిమానులు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఒకరు హాలీవుడ్‌ని ఏలుతున్న సూపర్ స్టార్ కాగా, మిగిలిన ముగ్గురు సింగింగ్ ద్వారా యావత్ ప్రపంచాన్ని ఊర్రూతలూగిస్తున్నారు.

    కాటి పెర్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్న రస్సెల్ బ్రాండ్ కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. తన భర్త నుండి విడాకులు తీసుకున్నప్పటి నుండి కాటి పెర్రీతో రాబర్ట్ ప్యాటిన్సన్ ఒక స్నేహితుడి మాదిరి సహావాసంగా మెలుగుతున్నాడు. జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేసుకుంటుండగా, రాబర్ట్ ప్యాటిన్సన్ తన చిన్ననాటి ప్రాణ స్నేహితురాలు క్రిస్టినా స్టివార్ట్‌తో పీకల్లోతు లవ్‌లో ఉన్నాడు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    Singer Katy perry says she had a good time with Robert Pattinson, Justin Bieber and Selena Gomez after screening of her movie “Katy Perry: Part of Me”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X