విడాకులు.. వెంటనే ట్విట్టర్ నుండి అన్ ఫాలో
భారత దేశ సాంప్రదాయాలను గౌరవించి భారత దేశంలో వచ్చి మరీ పెళ్లి చేసుకున్న హాలీవుడ్ జంట కాటీ పెర్రీ, రస్సెల్ బ్రాండ్. సింగర్‌గా కాటీ పెర్రీకి మంచి గుర్తింపు ఉంటే, బ్రిటిష్ కమెడియన్‌గా రస్సెల్ బ్రాండ్ పెట్టింది పేరు. ఐతే ఇటీవల కాలంలో కొన్ని మనస్పర్దలు కారణంగా ఈ జంట విడాకులు తీసుకున్నారు. దీంతో కాటీ పెర్రీ తన మాజీ భర్త మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో అతనిని ఫాలో అవ్వడం మానివేసింది. దీనిని బట్టి రస్సెల్ బ్రాండ్‌పై కాటీ పెర్రీకి ఎంత కోపంగా ఉందో తెలిసిపోతుంది.
27 సంవత్సరాల వయసు కలిగిన కాటీ పెర్రి శుక్రవారం నుండి బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ ట్వీట్స్‌ని ఫాలో అవడం ఆపివేశారు. ఐతే రస్సెల్ బ్రాండ్ మాత్రం తన మాజీ భార్య కాటీ పెర్రి ట్విట్టర్‌ని ఫాలో అవుతున్నారు. 36 సంవత్సరాల వయసు కలిగిన రస్సెల్ బ్రాండ్ డిసెంబర్ 30వ తారీఖున తన భార్య నుండి విడాకులు కావాలని కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఐతే క్రిస్ మస్‌ని ఇద్దరూ బ్రహ్మాండంగా జరుపుకున్నారు.
సింగర్ కాటి పెర్రీని మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో 14 మిలియన్ల ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. రస్సెల్ బ్రాండ్, కాటీ పెర్రి ఇద్దరూ అక్టోబర్ 2010న ఇండియాలో పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.


Click it and Unblock the Notifications











