సినిమా సెట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం... అసలు ఏం జరిగిందంటే?

ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రాబర్ట్ పాటిసన్ ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న 'టెనెట్' షూటింగ్ ముంబైలో జరుగుతుండగా ఓ వ్యక్తి సెట్స్‌లో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అయితే వెంటనే చిత్ర బృందం స్పందించి అతడిని కాపాడారు. తాజ్ హోటల్ ముందు సముద్రంలో దూకి అతడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నంచారు. గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో తన సిబ్బందితో కలిసి నోలన్ షూటింగ్ జరుపుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

ముంబైలో షూటింగ్

ముంబైలో షూటింగ్

‘టెనెట్' చిత్ర బృందం కొలాబా కాజ్‌వే మార్కెట్‌లో సోమవారం షూటింగ్ జరిపారు. మార్కెట్లో ప్యాకప్ అయిన తరువాత, వారు రాయల్ బాంబే యాచ్ క్లబ్ సమీపానికి షూటింగ్ షిప్ట్ చేశారు. మూవీ టీం మధ్యాహ్నం నాటికి తమ పనిని ముగించి, సాయంత్రం షూట్ కోసం సిద్ధమవుతున్నారు. షూట్ కోసం గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో వారు సుమారు 40 పడవలను ఏర్పాటు చేశారు.

లైఫ్ గార్డులు అతడిని పట్టుకోలేకపోయారు

లైఫ్ గార్డులు అతడిని పట్టుకోలేకపోయారు

తాజ్ హోటల్ ఎదురుగా ఒక వ్యక్తి నీటిలోకి దూకడం చిత్ర బృందం కంటపడింది. లైఫ్‌గార్డ్‌లు వెంటనే ఆ వ్యక్తిని కాపాడటానికి డైవ్‌ చేసినా అతన్ని పట్టుకోలేకపోయారు. అప్పుడు సిబ్బంది లైఫ్‌గార్డులకు తాడు అందించి ఆ వ్యక్తిని పట్టుకోవడానికి సహాయం చేశారు.

ప్రత్యక్ష సాక్షి ఏమంటున్నారంటే...

ప్రత్యక్ష సాక్షి ఏమంటున్నారంటే...

ప్రత్యక్ష సాక్షి ఒకరు బాలీవుడ్ పత్రికతో మాట్లాడుతూ... "లైఫ్‌గార్డ్‌లు ఆ వ్యక్తిని పట్టుకోలేకపోయారు, కాని సినిమా [టెనెట్] సెట్ డిజైన్‌కు కృతజ్ఞతలు, వారు మనిషిని కాపాడటానికి తాడును ఉపయోగించి అతన్ని రక్షించారు. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని తీసుకుని వెళ్లారు. చిత్ర సిబ్బందిలో ఒకరు అతడి పరిస్థితి ఎలా ఉందని చెక్ చేసినపుడు బాగానే ఉన్నాడు." అని పేర్కొన్నారు.

10 రోజుల పాటు షూటింగ్

దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ సహా టెనెట్ బృందం షూటింగ్ కోసం సెప్టెంబర్ 14 న ముంబైలో అడుగుపెట్టింది. ఈ ఇద్దరూ ముంబై ఎయిర్‍‌పోర్టులో అడుగు పెట్టగానే అభిమానులు సెల్పీల కోసం ఎగబడ్డారు. టెనెట్ బృందం ముంబైలో 10 రోజుల పాటు షూటింగ్ చేసేందుకు అనుమతి తీసుకున్నారు.

టెనెట్

టెనెట్

టెనెట్‌ను క్రిస్టోఫర్ నోలన్, ఎమ్మా థామస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ ప్యాటిన్సన్, ఎలిజబెత్ డెబికి, ఆరోన్ టేలర్-జాన్సన్, క్లెమెన్స్ పోయసీ, మైఖేల్ కెయిన్, కెన్నెత్ బ్రానాగ్, డింపుల్ కపాడియా మరియు హిమేష్ పటేల్ నటిస్తున్నారు. అంతకుముందు, టెనెట్ నుండి డింపుల్ కపాడియా లుక్ లీక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X