ఈ ఏటి బెస్ట్ హీరోగా అతను, బెస్ట్ విలన్ గా అతని మాజీ భార్య..!!

By Kuladeep

వారిద్దరూ ఓ లియాలిటీ షో లో ఒకరినొకరు కలుసుకున్నారు. వారి పరిచయం స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమకు దారి తీసింది. పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన వారిద్దరూ పెళ్లి ద్వారా ఒకటయ్యారు. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కలిగారు. అలా ఐదేళ్ల పాటు సజావుగా నడిచిన వారి కాపురం ఆ తర్వాత కుప్పకూలిపోయింది. దీనికి ఆమె చంచల మనస్తత్వమే కారణమని చాలా మంది అభిప్రాయం. ఆ జంటే లండన్ కు చెందిన ప్రముఖ టాప్ లెస్ మోడల్ క్యాటీ ప్రైజ్, ఆస్ట్రేలియాకు చెందిన సింగర్ పీటర్ ఆండ్రీ.

అలా విడిపోయాకా ఆమె లండన్ తిరిగి వచ్చేసింది తన ఇద్దరి పిల్లలతో. ఆ తర్వాత ఆమె అతని మీద దుమ్మెత్తి పోసింది. అతనో అమ్మాయిల పిచ్చోడని, అతనికి చాలా మంది తో అక్రమసంబంధం వుందని విరుచుకుపడింది. ఈ వ్యాఖ్యలను అతను తిప్పికొట్టాడు. ఆ తర్వాత ఆమె అలెక్స్ రెయిడ్ అనే ఓ బాక్సర్ తో సహజీవనం చెయ్యనారంభించింది. కానీ అతను మాత్రం ఒంటరిగానే వుంటున్నాడు. ఆరు నెలల తర్వాత రెయిడ్ బోర్ కొట్టాడో ఏమో ఆమె అతన్ని వదిలేసి తిరిగి తన భర్తతో కలసిపోవాలనుకొని అతనికి ఈ నిషయాన్ని ప్రతిపాదించింది. కానీ ఈ ప్రతిపాదనను అతను తిరస్కరించాడు. దీంతో ఆమె తిరిగి రెయిడ్ తో కలసి రహస్య కాపురం చేస్తోంది.

దీంతో ఆమె అంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. దీనికి నిదరిశనమే ఇటీవల నిర్వహించిన సర్వే. ఇందులో ఈ ఏటి ఉత్తమ రియల్ విలన్ గా ఈమె కు ఎక్కువ మంది ఓటువేసారు. దీంతో ఈమె ఈ ఏటి ఉత్తమ విలన్ ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా అతను ఈ ఏటి ఉత్తమ హీరోల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఇలా ఈ మాజీ భార్యాభర్తలిద్దరూ తూర్పు పడమరలుగా నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X