ఒక్క మేసేజ్ జీవితాలను కలిపింది..!
పీటర్ ఆండ్రే, క్యాటీ ప్రైస్ ప్రేమించి పెళ్లి చేసుకొని సంవత్సరాల జీవనం సాగించిన తర్వాత కొన్ని అనివార్య కారణాల విడిపోవడం జరిగింది. ఐతే ఇటీవల వీరి పిల్లల కోసం వీరు కలసి జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరూ మరలా కలసి జీవించడానికి కారణం పిల్లల కెరియర్‌ని దృష్టిలో పెట్టుకోవడంతో పాటు రిలేషన్ షిప్‌కి గౌరవం కల్పించే భాగంలో ఫోన్ కాల్స్ ద్వారా ఇద్దరూ సంభాషించుకోని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ న్యూస్ విన్న అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తూ మరికొంత మందికి చాలా ఆశ్చర్యాన్ని కలగజేసింది.
వీరి ప్రేమకు అపురూపంగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఒకరికి ఆరు సంవత్సరాలు కాగా, మరోకరికి నాలుగు సంవత్సరాలు. వీరంతా కలసిన సందర్బంలో ఈ సంవత్సరం క్రిస్ మస్ సంబరాలను ఒకే చొట చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. డైలీ మెయిల్ అందించిన సమాచారం ప్రకారం త్వరలోనే పీటర్ ఆండ్రే, క్యాటి ప్రైస్ సంయుక్తంగా పబ్లిక్ ముందు హాజరుకానున్నారు. ఈ క్రిస్ మస్‌కి పిల్లలతో కలసి సరదాగా ట్రిప్స్‌ని కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం.
రాబోయే కాలంలో వీరిద్దరి మద్యన ఉండే సంబంధం రొమాంటిక్‌గా ఉంటుందో లేదో తెలియదు గానీ, పిల్లలతో మాత్రం చాలా అనుబంధంగా మెలగాలని నిర్ణయం తీసుకున్నారు. చాలా సంవత్సరాల క్రితం విడిపోయిన వీరిద్దరూ ఇలా సడన్‌గా కలవడానికి గల కారణాలను విశ్లేషిస్తే ఇటీవల క్యాటీ ప్రైస్ 'మోర్గాన్ లైప్ స్టోరీస్ షో' పాల్గోనడం జరిగింది. ఆ షోలో క్యాటీ ప్రైస్ బంధాల గురించి చెప్పిన స్టేట్ మెంట్స్ తనకు రిలేషన్ షిప్స్‌ని తెలియజేశాయని, వెంటనే క్యాటీ ప్రైస్‌కి మనమిద్దరం ఒకసారి కలవాలని మెసేజ్ పెట్టాడు. ఒక్క మేసేజ్ వీరిద్దరి మద్య మరలా ప్రేమను పుట్టించింది. ఈ మేసేజ్ వీరిద్దరి జీవితాలను మార్చి వేసింది.


Click it and Unblock the Notifications











