నేను కూడా మంచి నాన్నఅని నిరూపించుకుంటాను..!
కొంత మంది మగవారికి నోటిదూల ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారిలో మన హాలీవుడ్ హీరోలు సైతం తక్కువేం తినలేదంటున్నారు. గ్రాహామ్ నార్టన్ షోలో మ్యాగజైన్ ఇచ్చిన ఇంటర్యూలో తన మాజి భార్యపై కామెంట్స్ చేసినందుకు కోర్టులో పిటిషన్ వేశారు ఆ మాజి భార్య. కాటి ప్రైస్ మరియు పీటర్ ఆండ్రూ ఇద్దరూ ప్రేమించి పెళ్శి చేసుకున్నారు. పీటర్ ఆండ్రూ తన మేనేజర్ అయినటువంటి క్లారి పోవెల్ తో అక్రమ సంబంధం కారణంగా వీరిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. వీరిద్దరి ప్రేమ ఫలితంగా వీరికి ఎనిమిది సంవత్సరాల హార్వే పుట్టాడు.
ఐతే వీరిద్దరి మధ్య గోడవ ఏంటని అనుకుంటున్నారా. ఇటీవల కాలంలో పీటర్ ఆండ్రూ కి కోర్టు రిట్ ని సమర్పంచింది. దానికి కారణం తన మేనే జర్ మత్తులో పడి తన కొడుకుని సరిగా చూసుకోవడం లేదని, ఐతే దీనిపై స్పందించిన పీటర్ ఆండ్రూ మాట్లాడుతూ నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను కూడా మంచి నాన్న నని నిరూపించుకుంటానని అంటున్నాడు. అంతేకాకుండా ఈ విషయంలో మేనేజర్ క్లారి పోవెల్ మాట్లాడుతూ ప్రస్తుతం బాబు మా దగ్గరే ఉంటున్నాడని, అది సహించలేకే కాటి ప్రైస్ ఇలా చేసిందని అంటున్నారు. పీటర్ ఎప్పుడూ అసలు బాబు విషయంలో తప్పు చేయలేదని అన్నారు. చివరగా కాటిప్రైస్ మాట్లాడుతూ కోర్టులో పేసే టు పేస్ మాట్లాడి తేల్చుకుంటామని చెబుతోంది. కాటి స్నేహతులు మాత్రం తన కుమారుని తన దగ్గరకు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు కాని పీటర్ మాత్రం ఈ విషయంలో ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారో అర్దం కావడం లేదు.


Click it and Unblock the Notifications











