ఆ బరితెగించిన దానికోసం చావాలనుకున్నాడు..
లండన్ కు చెందిన టాప్ లెస్ మోడల్, నిరంతర వివాదస్రవంతి క్యాటీ ప్రైజ్ అలెక్స్ రెయిడ్ కన్నా ముందు ఆస్ట్రేలియాకు చెందిన సింగర్ పీటర్ ఆండ్రీని వివాహం చేసుకొని విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె నెలతిరక్కుండానే అలెక్స్ రెయిడ్ అనే కొత్త బాయ్ ఫ్రెండ్ తో కులుకుతూ తిరగనారంభించినా పీటర్ మాత్రం ఆమెనే తలచుకుంటూ ఆమె తలపులతో నిత్యం నరకం అనుభవించాడట. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల మీడియా ముఖంగా వెళ్లడించాడు.
తనెంతగానో ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య తనని వీడి వెళ్లిపోవడమే కాకుండా నెలయినా కాకముందే మరో బాయ్ ఫ్రెండ్ తో కులుకుతుండటంతో పీటర్ తట్టుకోలేకపోయాడట. ఎంత లేదన్నా రోజుకు 20 గాయాలు అయ్యేలా తనని హింసించుకొనే వాడినని..ఒకానొక సమయంతో చనిపోవలనే ఆలోచనలు వచ్చినా తన తల్లిదండ్రులను, పిల్లలనూ దృష్టిలో వుంచుకొని అలాంటి పనిచెయ్యలేదని..అయినా తన భర్తను, పిల్లలనూ గాలికొదిలేసిన ఈ బరితెగించిన దాన్కోసం నేనెందుకు చావాలని ఆయన అనడం కొసమెరుపు.


Click it and Unblock the Notifications











