ఆమె గురించి ఆలోచించే ప్రసక్తే లేదు...!!
ఆస్ట్రేలియా గాయకుడు పీటర్ ఆండ్రీ తిరిగి తన మాజీ భార్య, ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ ను తన జీవితంలోకి ఆహ్వానించనున్నాడని వార్తలు వచ్చిన మాట తెలిసిందే. 'ఐయామ్ సెలబ్రిటీ గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్' అనే రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు కలుసుకున్న వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకొని, ముగ్గురు పిల్లలను పొందాక అభిప్రాయ భేదాలు వచ్చి విడాకులతో విడిపోయారు. ఆ తర్వాత తిరిగి పీటర్ ను తన వైపు తిప్పుకోవడానికే అన్నట్టు క్యాటీ తిరిగి 'ఐయామ్ సెలబ్రిటీ..' రియాలిటీ షోలో పాల్గొనడానికి వెళ్లినట్టు, ఆ షో చూసిన పీటర్ తిరిగి క్యాటీ మీద మనసు పడ్డాడని, అంతే కాకుండా క్యాటీ కూడా తనని తిరిగి తన జీవితంలోకి తనని తీసుకోమని పీటర్ ను అడగటంతో పీటర్ మనసు మార్చుకొని తిరిగి ఆమెను భార్యగా స్వీకరించడానే వార్తలు వచ్చాయి.
కానీ ఈ వార్తలను పీటర్ చాలా తేలికగా తీసిపారేసాడు. అసలు తనకా ఆలోచనే లేదని, అయినా తను రియాలీ షోను చూడనే లేదని అలాంటిది ఎలా ఆమెను చూసి మనసు మార్చుకుంటానని ఎదురు ప్రశ్నించాడు. కానీ తన పిల్లల భవిష్యత్తు కోసం ఎమైనా చేస్తానని చెప్పాడు.


Click it and Unblock the Notifications











