»   » ముందు కడుపు తర్వాత పెళ్శి అంటున్న ప్రముఖ నటి..!

ముందు కడుపు తర్వాత పెళ్శి అంటున్న ప్రముఖ నటి..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాలీవుడ్ నటి మరియు మోడల్ 'అబ్బి క్లాన్సి' తను 12వారాల ప్రెగ్నెన్సీనని, అంతేకాకండా పుట్టబోయేది గ్యారంటీగా మగపిల్లవాడేనని ఆ విషయం స్కానింగ్ లో తెలియజేశారని వెల్లడించారు. తనకు ఎంతో సంతోషంగా ఉందని కూడా అన్నారు. ఈ విషయం తన కోస్టార్ అయినటువంటి 'జేమ్స్ బ్రోన్' కున్న సెంట్రల్ లండన్ లోని ప్రయివేట్ హాస్పిటల్లో ధృవీకరించడం జరిగిందన్నారు. పుట్టబోయే తన బాబు కి 'జాని' అని పేరుని పెడతామని అనుకుంటున్నామని తెలిపారు. ఈ విషయం త్వరలో తాను చేసుకోబోయే ఇంగ్లాండ్ పుట్ బాల్ ఆటగాడు 'పీటర్ క్రౌచ్' కి ఫోను ద్వారా తెలిపానని ఆమె అన్నారు. మేమిద్దరం 2009 నుంచి డేటింగ్ లో పాల్గోంటున్నామని, త్వరలో పెళ్శి చేసుకోబోతున్నామని తెలిపారు.

అబ్బి క్లాన్సి మాట్లాడుతూ నాకు ఖచ్చతంగా అబ్బాయే పుడతాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది. వీటితో పాటు డాక్టర్స్ ఇచ్చినటువంటి స్కానింగ్ కాపీని టివి షోలలోను, మ్యాగజైన్ లకు చూపించడమే కాకుండా, తనకు పుట్టబోయే మొట్టమొదటి బేబి గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని వివరించారు. ప్రస్తుతం అబ్బి క్లాన్సి 'గ్రేట్ బ్రిటిష్ హెయిర్ డ్రెస్సర్' అనే షోలో చేస్తుంది. ఈ షోలో తన నడుముని అందరకీ చూపిస్తూ నా నడుము పెరుగుతుందని, జీన్స్ ఫ్యాంట్స్ కూడా నాకు చాలా టైట్ అవుతున్నాయని తన గోడు వినిపించింది. తనకు బేబికి ఇప్పటినుండే మిలియన్స్ కొద్ది ఆటబొమ్మలు కొంటున్నానని సరదాగా అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu