twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోయిన్ నగ్న చిత్రం అమెరికా నడి వీధిలో

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ అందాల జంటగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ ఎంతో మంది సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచారు. ఏంజిలీనా జోలీ కొన్ని సినిమాల్లో పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించిన సందర్బాలు ఉన్నాయి. సాధారణంగా హీరోలకు, హీరోయిన్లకు విగ్రహాలు పెట్టడం అనేది హాలీవుడ్ స్టయిల్ కాదు. కానీ అమెరికాలోని ఓక్లహోమా సిటీలో ఏంజిలీనా జోలీ నిలువెత్తు నగ్న విగ్రహం త్వరలో అమెరికాలో దర్శనమివ్వబోతోంది.

    కంచుతో తయారు చేస్తున్న ఏంజీలీనా నగ్న విగ్రహాన్ని శిశువుకు పాలిస్తున్నట్లుగా ఉంటుందట. న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ శిల్పి డానియల్ ఎడ్వార్డ్ మాట్లాడుతూ, శిశువుగా పాలిస్తున్నట్లుగా తాను మలుస్తున్న ఏంజిలీనా నగ్న విగ్రహం తల్లుల్లో చైతన్యం తీసుకు వస్తుందని చెప్పాడు. ముఖ్యంగా చంటి పిల్లలకు తల్లిపాలు ఎంత ముఖ్యమో ఈ విగ్రహం తెలియజేస్తుంటున్నాడు. ఈ ఇమేజిని ఏంజిలీనా తన ఇద్దరి కవలలకు పాలిస్తున్నప్పుడు తన బాయ్‌ఫ్రెండ్ బ్రాడ్ పిట్ ఫోటో తీశాడు. ఆ ఫోటో ఆధారంగా ఈ నగ్న విగ్రహాన్ని తయారు చేస్తున్నానని డామియల్ వెల్లడించాడు.

    ఇది ఇలా ఉంటే ఏంజిలీనా జోలీ నటించిన 'ల్యాండ్ ఆప్ బ్లడ్ అండ్ హానీ' సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా పోయిన సంవత్సరం బోస్నియా సిటీలో తీయడం జరిగింది. ఈ సినిమాలో ముఖ్యంగా బోస్నియా యుద్దం గురించిన సమాచారం కళ్లకు కట్టినట్లు చూపించడానికి ఏంజిలీనా జోలీ ప్లాన్ చేసినట్లు వినికిడి. ఇందులో ఏంజిలీనా జోలీ ఓ ముస్లిం యువతిగా నటించనున్నారని సమాచారం. యుద్దం జరిగిన తర్వాత అక్కడి ప్రజలు పడినటువంటి కష్టాలు, అంతేకాకుండా బోస్నియా మహిళలు సైనికలు చేత ఏవిధంగా హింసించ బడ్డారో ఈ సినిమాలో చూపించనున్నారు. అంతేకాకుండా ఏంజిలీనా జోలీని బోస్నియా 'హానరరీ హార్ట్ ఆప్ సారజీవో అవార్డు'తో సత్కరించడం జరిగింది.

    English summary
    The Hollywood star sits with brunette locks tumbling over her shoulders, with the top of her blouse pulled down to expose her breast - which is somewhat covered by the tiny fingers which just reveal the presence of one of her suckling twins.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X