twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పైరేట్స్ ఆఫ్ కరేబియన్’ సిరీస్‌లో ఊహించని మార్పు, జానీ డెప్ ఔట్!

    |

    'పైరేట్స్ ఆఫ్ కరేబియన్' సిరీస్ చిత్రాల్లో ఇప్పటి మెయిన్ లీడ్ కెప్టెన్ జాక్ స్పారో పాత్రలో అలరించిన హాలీవుడ్ నటుడు జానీ డెప్ ఇకపై కనిపించడు. ఈ సిరీస్ చిత్రాల నుంచి ఆయన తప్పుకున్నాడు. దీంతో డిస్నీ స్టూడియోస్ ఇక ముందు వచ్చే చిత్రాల్లో భారీ మార్పులకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయనేది ఇంకా వెల్లడి కాలేదు.

    గత 15 ఏళ్లలో పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సిరీస్‌లో వచ్చిన ఐదు చిత్రాలు.. 'ది కర్స్ ఆఫ్ ది బ్లాక్ పర్ల్, డెడ్ మ్యాన్స్ చెస్ట్, ఎట్ వరల్డ్స్ ఎండ్, ఆన్ స్ట్రేంజర్ టైడ్స్, డెడ్ మెన్ టెల్ నో టేల్స్' మొదలగు వాటిలో జానీ నటించారు.

    Pirates Of The Caribbean: Johnny Depp dropped as Captain Jack Sparrow

    ఈ ఫ్రాంచైజీ ఒరిజినల్ స్క్రిప్టు రైటర్‌ స్టువర్ట్ బీటిల్ జానీ డెప్ తప్పుకున్న విషయాన్ని ఖరారు చేశారు. ఇప్పటి జానీ డెప్ కెప్టెన్ జాక్ స్పారో పాత్రలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన నటనతో ఆ పాత్రకు మరింత వన్నె తెచ్చాడని తెలిపారు. అయితే అతడు తప్పుకోవడానికి గల కారణం మాత్రం వెల్లడించలేదు.

    'పైరేట్స్ ఆఫ్ కరేబియన్' ఫ్రాంచైనీ నుంచి తప్పుకోవడం జానీ డెప్ సొంత నిర్ణయమే అనే ప్రాచారం జరుగుతోంది. మరి అతడి పాత్రలో మరొకరు కనిపిస్తారా? లేక ఆ పాత్రే లేకుండా మార్పులు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

    ఈ సిరీస్ చిత్రాలు అన్ని కలిపి ప్రపంచ వ్యాప్తంగా 4.5 బిలియన్ డాలర్లు వసూలు చేశాయి. అయితే ఇందులో చివరగా వచ్చిన 'డెడ్ మెన్ టెల్ నో టేల్స్' మాత్రం బాక్సాఫీసు వద్ద తక్కువ వసూళ్లు సాధించి నిరాశ పరిచింది. కాగా... జానీ డెప్ నటించిన 'ఫెంటాస్టిక్ బీస్ట్స్: ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్‌వల్డ్' నవంబర్ 16న విడుదలకు సిద్ధమవుతోంది.

    English summary
    Hollywood actor Johnny Depp will no longer return as Captain Jack Sparrow in Pirates Of The Caribbean franchise. The original script writer of the franchise, Stuart Beattie, confirmed the news to Daily Mail at a recent event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X