లండన్‌లో మాన్షన్‌ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్

By Nageswara Rao

హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీలు లండన్‌లో £10మిలియన్లు పెట్టి ఓ మాన్షన్‌ని సొంతం చేసుకున్నారని సమాచారం. 'వోర్నీస్ ప్లేస్' పేరుతో ఉన్న ఈ మాన్షన్‌ని కోనుగోలు చేయడానికి గల కారణం.. గత వేసవిలో బ్రాడ్ పిట్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'వరల్డ్ వార్ జడ్' సినిమా షూటింగ్ సందర్బంలో బ్రాడ్ పిట్, జోలీలతో పాటు వీరి ఆరుగురు పిల్లలు ఇదే మాన్షన్‌లో నెలకు £30,000 అద్దె చెల్లించి మరీ నివసించారు.

ఈ మాన్షన్‌లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్, 15వ శతాబ్దానికి చెందిన చెక్కతో ఈ ఇంటిని నిర్మించారు. బ్రాడ్ పిట్, జోలీల అధికార ప్రతినిధి మాట్లాడుతూ లండన్‍‌లో వీరు ఈ ఇంటిని కోనుగోలు చేయడంతో బ్రిటన్‌పై వారికి ఎంత ఆప్యాయత ఉందో తెలిసిపోతుందని అన్నాడు. ఇటీవలే నిశ్చితార్దం ముగించుకోని .. త్వరలో పెళ్లి చేసుకోనున్న ఈ జంట అందరికి ఆదర్శంగా నిలవనుంది.

బ్రాడ్ పిట్, జోలీలు లండన్‌లో కోనుగోలు చేసిన ఇంటికి దగ్గర లోనే హాలీవుడ్ స్టార్ హీరోలు జార్జి క్లూనీ, జానీ డెప్, ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ సాంద్రా బుల్లక్‌లు నివసిస్తున్నారు. బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీల వివాహాం ఎక్కడ జరగనుందా అంటూ అభిమానులు సమాలోచనలు ప్రారంభించారు. అందరూ అనుకుంటున్నట్లే వేసవిలో దక్షణ ఫ్రాన్స్‌లో ఉన్న ఎస్టేట్‌లో పిట్, జోలీల 35 మిలియన్ పౌండ్ల విలువ చేసే ప్రయివేట్ ప్రార్దనాలయంలో చేసుకోనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి ఫంక్షన్‌కు సుమారు 200 నుండి 300 వరకు గెస్టులను ఆహ్వానించనున్నారు. పెళ్లి తారీఖుని మాత్రం అధికారంగా ఇంకా వెల్లడించ లేదు.

గెస్టుల లిస్ట్‌లో మాట్ డామన్, జార్జ్ క్లూనీ, జానీ డెప్ మరియు టామ్ క్రూజ్ లాంటి హాలీవుడ్ మహా మహులు రానున్నారు. గత ఏడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ ఇటీవలే నిశ్చితార్దం జరిగినట్లు అధికారకంగా వెల్లడించారు. పిట్, జోలీలు 2004లో మిష్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటికే పిట్‌కు జెన్నిఫర్ అనిస్టన్‌తో వివాహమైంది. 2005లో బ్రాడ్, ఏంజెలినాల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం బ్రాడ్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. ఏంజెలినాకు అప్పటికి రెండుసార్లు వివాహమైంది. ఆమె గతంలో జానీ లీ మిల్లర్, బిల్లీ బాబ్ థ్రాంటన్‌లను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బ్రాడ్, ఏంజెలినాలకు ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గుర్ని దత్తత తీసుకోగా, మరో ముగ్గురికి జన్మనిచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X